మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల రచ్చ అంతకంతకు పరాకాష్టకు చేరుకుంటోంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ వార్ పరాకాష్టకు చేరుకుంది. ఇంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు జీవిత ప్రస్థావించగా అతడి పేరు ప్రధానంగా హైలైట్ అయ్యింది.
ఇప్పుడు ఏకంగా నాగబాబు .. మంచు విష్ణు మీడియా సమావేశాల్లో ప్రధాని మోదీ పేరునే లాగారు. డైరెక్ట్ గా ప్రధాని ముందే కూచుని మాట్లాడగల సమర్థుడు ప్రకాష్ రాజ్ అంటూ పొగిడేసిన నాగబాబుకు కౌంటర్ గా మంచు విష్ణు తమ కుటుంబం ప్రధానిని ఎన్నిసార్లు కలిసిందో కూడా గుర్తు చేస్తూ తాను నేరుగా వెళితే వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేస్తారు! అంటూ ప్రస్థావించడం విశేషం.
నిజానికి ఆర్టిస్టుల ఎన్నికలకు ప్రధాని మోదీకి ఏంటి సంబంధం? ఈ కామెడీలేమిటో! అంటూ ప్రజలు షాక్ లు తింటున్నారు. మూవీ ఆర్టిస్టుల ఎన్నికల కోసం ప్రధాని పేరును ఉపయోగించడం కామెడీగా ఉందంటూ బోలెడంత రచ్చ సాగుతోంది.
మంచు విష్ణు అయితే ఏకంగా గత ఏడేళ్లలో మోదీని ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు కలిశారు.. మంచు ఫ్యామిలీ సభ్యులు ఎన్నిసార్లు కలిశారో లెక్కలేసుకోవాలని మరీ చెప్పడం ఇంకా హాస్యాస్పదం అన్న గుసగుస వినిపించింది. అయినా దీనికి జాతీయ స్థాయి నాయకులతో పనేంటి? అంటూ ప్రజల్లో చర్చ సాగింది. చూస్తుంటే ఎన్నికల ముందే అమెరికా అధ్యక్షుడిని.. ఐక్యరాజ్యసమితిని కూడా లాగేసేట్టున్నారంటూ ఒకటే సెటైర్లు పడుతున్నాయ్.