కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత మేకప్ వేసుకున్న సినిమా గాయత్రి మెగా హీరోలతో పోటీ పడుతూ ఈ నెల 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విస్తృతంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న మోహన్ బాబు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ముఖాముఖిలో డ్రగ్స్ ప్రస్తావన వచ్చినప్పుడు తన స్టాండ్ ఏంటో చెప్పేసారు. అనుమానితుల లిస్టులో తన బిడ్డ పేరు కూడా ఉందనే ప్రచారాన్ని విన్నప్పుడు వెంటనే ముగ్గురిని పిలిచి మాట్లాడానని - క్రమ శిక్షణతో పెంచిన వాళ్ళు దారి తప్పే సమస్యే లేదని స్పష్టం చేసారు. వారు అలాంటి వాటి జోలికి వెళ్ళే సమస్యే లేదన్న మోహన్ బాబు అదే నిజమైతే తాను ఎవరిని ఉపేక్షించనని చెప్పారు.యాంకర్ ఇంకాస్త పొడిగించే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ సున్నితంగా తిరస్కరించడం విశేషం.
ఇక తన సినిమా సంగతులు కూడా చాలా షేర్ చేసుకున్నారు మోహన్ బాబు. యాంకర్ పవన్ కళ్యాణ్ జనసేన గురించి అడిగినప్పుడు సినిమా ఇంటర్వ్యూలో తాను రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసారు. అయినా కూడా కవ్వించే ప్రయత్నం చేయటంతో వద్దు బ్రదర్ అని వారించారు. తన కోపతాపాల గురించి కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారని, డిసిప్లిన్ విషయంలో తాను స్ట్రిక్ట్ గా ఉండే మాట నిజమే అయినప్పటికీ చేయి చేసుకునే దాకా మాత్రం ఎవరు తెచ్చుకోలేదని చెప్పేసారు. తాను కొడతాను అనే మాట మాత్రం శుద్ధ అబద్దం అని క్లారిటీ ఇచ్చేసారు. కలెక్టర్ గారు షూటింగ్ టైం లో హీరొయిన్ సాక్షి శివానంద్ మీద చేయి చేసుకున్నారు అనే వార్త అప్పట్లో ప్రాచుర్యం పొందింది. దాని గురించే యాంకర్ అడిగారు.
గాయత్రి సినిమా కోసం కెరీర్ లో మొదటిసారి ప్రోస్తేటిక్స్ మేకప్ వేసుకున్న మోహన్ బాబు ఇందులో రిస్క్ అనిపించినా మూడు ఫైట్లు చేయటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను అన్ని చేయగలనా అని విష్ణు డౌట్ పడుతూ అడిగాడని , డూప్ లేకుండా చేయటం చూసాక ఇంకేమి మాట్లాడలేదన్న మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో ఒకటి వరస్ట్ క్యారెక్టర్ కాగా మరొకటి బెస్ట్ అనిపించేలా ఉంటుందట . శివాజీ - గాయత్రి పటేల్ పాత్రలలో 18 ఏళ్ళ తర్వాత డ్యూయల్ రోల్ చేస్తున్న మోహన్ బాబు రిజల్ట్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు