తనింటికి వచ్చిన ప్రముఖులకు ఆతిధ్యం ఇచ్చి సత్కరించటం తనకు అలవాటుగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చెప్పుకున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి పేర్నినాని తనింటికి వచ్చిన సందర్భంగా చిలవలు పలువలు చేసి ప్రచారం చేసిన విషయమై మోహన్ బాబు మండిపడ్డారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కొడుకు వివాహానికి వెళ్ళినపుడు మరో మంత్రి పేర్ని నాని కలిసినట్లు చెప్పుకున్నారు.
ఎలాగూ హైదరాబాద్ కు వచ్చారు కాబట్టి తనింటికి టిఫెన్ తినటానికి రమ్మని తానే ఆహ్వానించినట్లు చెప్పారు. తాను ఆహ్వానించాను కాబట్టే నాని తనింటికి టిఫిన్ కు వచ్చారని చెప్పారు. దాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఎలాగంటు మీడియా ముందు రెచ్చిపోయారు. అల్పాహారం పూర్తయిన తర్వాత పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్నామన్నారు.
అంతే కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసినపుడు సినిమా వాళ్ళు ఏమి మాట్లాడారో చెప్పమని అడగటం భావ్యమేనా అని అమాయకంగా ప్రశ్నించారు. భేటీలో ఏమి మాట్లాడుకున్నారని అడగటంలో ఏమి తప్పో అర్ధం కావటంలేదు. అన్నీ పార్టీల్లోను తనకు మిత్రలున్నారని చెప్పారు. ఎందరో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, తనింటకి వస్తుంటారని మోహన్ బాబు చెప్పుకున్నారు. అంటే తానెంత ప్రముఖుడనో అని చెప్పకనే చెప్పుకున్నట్లయ్యింది.
తనింటికి వచ్చిన వారికి భోజనం పెట్టి సత్కరించటం తనకు అలవాటన్నారు. అలాగే తాను కూడా ప్రముఖుల ఇళ్ళకు వెళతానని చెప్పుకున్నారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నందుకు పేర్నినానికి తన కొడుకు మంచువిష్ణు ధన్యవాదాలు చెప్పినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడుతు చెత్తనాకొడుకులు అంటు మోహన్ బాబు రెచ్చిపోయారు.