సీనియర్ నటుడు మోహన్ బాబు బాగా సిన్సియర్ అనే విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు ఆయనే స్వయంగా చెప్పేసుకోగలరు కూడా. ముఖ్యంగా సమయ పాలన విషయంలో చాలా కఠినంగా ఉంటారని.. ఆయన పిల్లలు కూడా పలుమార్లు చెబుతూనే ఉంటారు.
మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గాయత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ తాజాగా జరిగింది. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు యాక్టర్స్ కంటే కాస్త ముందే యాంకర్స్ వస్తుంటారు. కానీ ఈ 'గాయత్రి' షూటింగ్ టైములో అనసూయ పాపం కాస్త ఆలస్యం అయ్యేదనుకుంట.. ఇలాంటి సంఘటనలు సహజంగానే ఆయనకు చిరాకు పెట్టించేస్తుంటాయి. అయితే ఈ మధ్య తన కోపాన్ని.. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లు చెబుతున్న మోహన్ బాబు.. అనసూయ ఆలస్యంగా వచ్చిన విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా మాత్రం ఉండలేకపోయారు. చాలా సున్నితమైన కోటింగ్ ఇచ్చేశారు..
ఫ్లైట్ కోసం అయితే గంటన్నర ముందే వెళతామని.. సినిమా కోసం అర గంట ముందే చేరుకుంటారని.. మనం చెప్పిన సమయానికే పనివారు రావాలని అనుకుంటామని.. మనం అంతా కూలీలం అన్న మోహన్ బాబు.. అనసూయ మాత్రం సిన్సియర్ అని చెప్పారు. ఆమె ఎంతో కష్టపడుతూ ఉంటుందని తన కూతురు లక్ష్మి .. కొడుకు విష్ణు కూడా చెప్పారట. తనను బావా అని అనసూయ పిలిచిందని కూడా అన్నారు మోహన్ బాబు. మొత్తానికి అనసూయ ఆలస్యం అనే పాయింట్ విలక్షణంగా చెప్పారు కూడా మోహన్ బాబు.