తాను ఎంతో ఇష్టంగా ఓ సినిమా చూడాలనుకుంటే.. ఆ సినిమా టికెట్లు దొరకట్లేదంటూ తెగ బాధపడిపోతున్నారు మంచు మోహన్ బాబు. ఐతే ఈ బాధ చాలా తియ్యగా ఉందని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే ఆయనకు టికెట్లు దొరకనిది కొడుకు మంచు విష్ణు నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాకట మరి. ఈ రోజు మల్టీప్లెక్స్ థియేటర్ లో జనాల మధ్య కూర్చుని ఈడోరకం ఆడోరకం సినిమా చూడాలనుకుంటే టికెట్లు దొరకలేదని మోహన్ బాబు వెల్లడించారు. అతి కష్టం మీద శనివారానికి కొన్ని టికెట్లు మాత్రం సంపాదించగలిగానని ఆయన చెప్పారు.
‘‘క్లీన్ సూపర్ హిట్ అంటే ఇదే మరి. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాను జనాల మధ్య చూడాలని.. వాళ్ల స్పందన చూడాలని అనుకున్నా. కానీ మల్టీప్లెక్సుల్లో ఈ రోజు టికెట్లు దొరకలేదు. నిర్మాత అనిల్ సుంకర టికెట్ల కోసం అడుక్కోవాల్సి వచ్చింది. అతను కష్టపడి రేపటికి కొన్ని టికెట్లు సంపాదించాడు. కానీ నేను అడిగినన్ని టికెట్లు మాత్రం తెప్పించలేకపోయాడు. టికెట్లు అప్పటికే అమ్ముడైపోవడమే దీనికి కారణం. ‘ఈడోరకం ఆడోరకం’ టీం మొత్తానికి కంగ్రాట్స్. విష్ణు విషయంలో చాలా హ్యాపీగా ఉంది. నాగేశ్వరరెడ్డి తో అతడి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ అని మరోసారి రుజువైంది. ఇంకా చాలా రావాల్సి ఉంది’’ అని మోహన్ బాబు ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు.