స్త్రీ వాదినని చెప్పడానికి భయపడను.. 3500 తో సినిమా తీశా..!

Update: 2022-12-14 10:30 GMT
టాలీవుడ్ లో అభిరుచి గల దర్శకుల్లో ఒకరు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన చేసే సినిమాల్లో తెలుగుదనం ఉట్టి పడుతుంది. వెరైటీ టైటిల్స్ పెడుతూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ టైం లో కూడా ఆయన కేవలం తెలుగు టైటిల్స్ పెడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. తన కెరీర్ అసలు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు లాంటి ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

మీ దృష్టిలో అసలు సినిమా ఏంటి.. అవార్డుల కోసం మీరు సినిమాలు తీస్తారా అని అడిగితే.. ఆడియన్స్ లేనిదే కళాకారులు లేరు.. ఏ సినిమా కూడా అవార్డుల కోసం తీయరు. తన వరకైతే ప్రేక్షకులకు వినోదం అందిస్తూనే ఆలోచింప చేయాలని చూస్తా.. వారి డబ్బు, టైం వృధా కాకుండా సినిమా చూసి వెళ్లాక మంచి అనుభూతి ఇవ్వాలని కోరుతానని అన్నారు.

తణుకులో పుట్టి.. విజయవాడలో పెరిగిన తాను తన తండ్రి బాపు రమణల స్నేహితుడు కావడంతో సంపూర్ణ రామాయణం రీల్ చూశాను.. అక్కడ లీలా మహల్, నవరంగ్, ఊర్వశి థియేటర్ లే తనకు విద్యాలయాలు అన్నారు మోహనకృష్ణ. సినిమా రంగంపై మంచి ఉద్దేశం ఉండటంతో ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడు సినిమాలు వద్దని చెప్పలేదు.

నాన్న గారు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున టైం లో సి రామ్మోహన్ రావు గారి తనకు స్క్రిప్ట్ ఇచ్చి చదవని అన్నారు. బాగా చదివానని.. రేడియోలో ధారావాహిక పాత్ర ఒకటి ఇచ్చారు. తనని ప్రభావం చేసిన సినిమా శివ అని చెప్పారు మోహనకృష్ణ. మణిరత్నం సినిమాలు కూడా బాగా చూసేవాడిని.. 10వ తరగతిలోనే సినిమాల గురించి తన స్నేహితులతో మాట్లాడే వాడినని మోహనకృష్ణ అన్నారు.

చలం రాసిన దోషగుణం చదివి దాన్ని సినిమాగా తీయాలని అనిపించింది. కెనడాలో ఫిల్మ్ స్కూల్ లో చదువుకునే టైం లో ఈ స్క్రిప్ట్ నే శాంపిల్ గా పంపించాను. అక్కడ నుంచి వచ్చాకే ఆ కథతోనే 2003 లో గ్రహణం సినిమా చేశానన్నారు మోహనకృష్ణ. చలి అనే షార్ట్ ఫిల్మ్ ని 3500 పెట్టి తీశాను. అందులో తన స్నేహితులే నటించారు. ఇంట్లోనే డబ్బింగ్ కూడా చేశాం.

సారధి స్టూడియోలో ఆ షార్ట్ ఫిల్మ్ వేయగా తణికెళ్ల భరణి గారు వచ్చారు. ఆ సినిమా టైం లోనే గ్రహణం స్క్రిప్ట్ చూపించాను. సినిమాలో కాస్టింగ్ ఎవరు ఉండాలన్నది కూడా ఆయనే చెప్పారు. అలా ఆరు లక్షల్లో గ్రహణం పూర్తి చేశాక. తెలుగులో వచ్చిన మొదటి డిజిటల్ ఫిల్మ్ అది. ఆ సినిమా నేషనల్ అవార్డ్స్ కి పంపించింది కూడా భరణి గారే.. గ్రహణం సినిమా డిజిటల్ నుంచి ఫిల్మ్ లోకి మార్చడానికి 11 లక్షలు ఖర్చు చేశానని అన్నారు మోహనకృష్ణ. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు మోహనకృష్ణ.

తాను గ్రంధాలయంలో చదివిన ఒక నాటకాన్ని స్పూర్తిగా పొంది అష్టా చమ్మా సినిమా తీశానని. 2008 లో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుందని అన్నారు. అంతకుముందు 2006 లో తాను తీసిన మాయాబజార్ సినిమా నిరాశపరచిందని అన్నారు. అంతేకాదు కొన్ని నవలలు కలిపి తీసిన బందిపోటు సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అల్లరి నరేష్ ని కొత్తగా చూపించాలని అనుకోవడం వల్లే అలా జరిగిందని అన్నారు. నా సినిమాలో సమానత్వం ఉంటుంది. తాను స్త్రీ వాదిని అని చెప్పుకోవడానికి భయపడను అంటున్న మోహనకృష్ణ సినిమాల్లో మహిళల పాత్రలు రాసేప్పుడు చాలా ప్రాముఖ్యత ఉండేలా చూస్తానని అన్నారు మోహనకృష్ణ.

సినిమా దర్శకుడు ప్రతి సినిమాకు తాను కూడా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి. ఒక సినిమాకు చేసిన తప్పులని మరో సినిమాలో చేయకుండా సరిదిద్దుకోవాలి. చేస్తున్న పని ఏదైనా ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటే జీవితంలో తక్కువ అపజయాలు వస్తాయని అంటున్నారు మోహనకృష్ణ. చలి సినిమా చేశాక ఆర్జీవి ఒక కథ ఇచ్చి చేయమన్నారు. కానీ అది ఆయన అంచనాలకు తగినట్టుగా తాను చేయలేదు.

తెలుగు వాళ్లకు మన సినిమాల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలి. చిన్నప్పటి నుంచి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడం మానేశారు. తెలుగు పట్ల అందుకే కొందరికి పట్టు లేకుండా పోతుందని అన్నారు. అపజయం వచ్చిన టైం లో కామెంట్స్ ని అసలు చదవను.. నెల తర్వాత వాటిని చూస్తాను. సినిమా ఫెయిల్ అయితే ఆ తప్పులని రిపీట్ అవకుండా నెక్స్ట్ సినిమాలో జాగ్రత్త పడతాను.

ఇక ఈ తరం దర్శకులను తానిచ్చే సలహా అంటూ ఏమి లేదు. సాహిత్యానికి సంబంధించిన కథలు చదవాలి.. అలాంటి సినిమాలు చూడాలి. కష్టపడుతూ ప్రతిభ నమ్ముకుని ముందు వెళ్లాలని అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News