ఎన్టీఆర్... మోహన్‌లాల్ ఈ ఇద్దరూ కలిసి నటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇలాంటి కాంబినేషన్ ఒకటి స్క్రీన్ మీదికి వస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా ఇంతవరకూ ఎవ్వరికీ రాలేదు. జనతా గ్యారేజ్ సినిమాలో ఈ ఇద్దరి కాంబినేషన్ అందరినీ ఇప్పుడు అలరిస్తోంది. మోహన్ లాల్ విలక్షణ నటుడు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. ఈ ఇద్దరి మధ్యా సన్నివేశాలు అంత బాగా పండుతాయని ఊహించిన దర్శకుడు కొరటాల శివకు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంకోటీ... మలయాళ నటుడికి తెలుగు సినిమాలో అంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా మెచ్చుకోవాలి. జనతా గ్యారేజ్ చిత్రం మొదలైన దగ్గర నుంచే మోహన్ లాల్ పట్ల తమకు ఉన్న మర్యాదనూ గౌరవాన్నీ కనబరుస్తూ వచ్చింది చిత్ర యూనిట్.
నిజానికి మనకు మోహన్ లాల్ కొత్త. ఆయన మలయాళంలో టాప్ స్టార్ అయినా కూడా తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటుడు అని చెప్పాలి. ఇక, తారక్ మనకు టాప్ హీరో. అయినా సరే, సినిమా టైటిల్స్ లో ముందుగా మోహన్ లాల్ పేరు వేయడం మెచ్చుకోదగ్గది. సినిమాలో కూడా ప్రథమార్థం మోహన్ లాల్ పాత్ర డామినేషన్ ఉంటుంది. ద్వితీయార్థంలో తారక్ రంగంలోకి దిగినా కూడా, ఆ పాత్రను మూలకి పడేశారు అనే ఫీలింగ్ ఎక్కడా కలుగకుండా దాని ప్రాధాన్యతను నిలుపుతూనే వచ్చాడు దర్శకుడు. పతాక సన్నివేశానికి వచ్చేసరికి మరోసారి మోహన్ లాల్ పాత్ర ప్రాధాన్యం అవుతుంది.
సీనియర్ నటుడు మోహన్ లాల్ కి వచ్చిన గౌరవం అది. ముందుగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది దర్శకుడు కొరటాల శివను. ఈ కాంబినేషన్ అనుకుని, అనుకున్నది తెరమీదికి తెచ్చినందుకు ఆయన్ని మెచ్చుకోవాలి. ఒక హీరో చిత్రంలో మరో నటుడి పాత్ర డామినేట్ చేస్తున్నట్టు ఉన్నా కూడా దాన్ని సహృదయంతో అంగీకరించినందుకు ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. మనవరకూ ఎన్టీఆర్ పెద్ద స్టార్ - అయినాసరే వాల్ పోస్టర్ల దగ్గర నుంచీ సినిమాలో టైటిల్స్ - కథలో ప్రాధాన్యత... ఇలా అన్ని విషయాల్లోనూ మోహన్ లాల్ కి ఎంతో గౌరవం ఇచ్చింది జనతా గ్యారేజ్. మొత్తానికి జయహో జనతా అనిపించింది.