బన్నీ ఎప్పుడో మాస్ ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు. ఆయన లవ్ స్టోరీలు చేసే పరిస్థితులు అస్సలు లేవిప్పుడు. ఒకవేళ చేసినా అది `ఇద్దరమ్మాయిలతో` తరహాలో మాసీగా ఉండాల్సిందే. అప్పుడే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. అలా కాకుండా అందరిలాగే బన్నీ చేతిలో కూడా ఓ రోజా పువ్వు పెట్టేసి అమ్మాయి వెనకాల తిరగమంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు తగ్గట్టుగానే ఆయన చేసే సినిమాల్లో మాస్ కి మాస్ - స్టైల్ కి స్టైల్ ఉండాల్సిందే. ఇమేజ్ దృష్ట్యా ఇక తెలుగులో లవ్ స్టోరీలు చేయలేనన్న విషయం బన్నీకీ తెలుసు.
అందుకే మాస్ మంత్రమే జపిస్తున్నారు. అయితే విచిత్రంగా మలయాళంలో మాత్రం ప్రేమకథలో నటిస్తానని మాటిచ్చాడు బన్నీ. యూత్ ఫుల్ గా ఉండే లవ్ స్టోరీని మలయాళంలో చేయాలనుందని ఇటీవల కేరళలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అక్కడ ఇమేజ్ ని పక్కనపెట్టి నటించాలనేది బన్నీ ఆలోచన కావచ్చు. కానీ ఇప్పటికే బన్నీ సినిమాలన్నీ అక్కడ విడుదలయ్యాయి. తెలుగులోలాగే అక్కడే ఇమేజ్ వచ్చింది. కానీ బన్నీ మాత్రం తెలుగులో చేయలేనిది మలయాళంలోనైనా చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. మలయాళం ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి స్ట్రెయిట్‌గా ఓ చిత్రం చేయాలనే ఆలోచన ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. మలయాళంలో నచ్చిన నటుడు మోహన్ లాల్ అనీ, ఆయనతో కలిసి తెరను పంచుకోవాలనుందని కూడా తెలిపాడు బన్నీ. ఇటీవల మలయాళంలో యోధవుగా విడుదలైంది సరైనోడు. అక్కడ చిత్రానికి లభించిన స్పందనపై ఆనందం వ్యక్తం చేశాడు బన్నీ.