అందమైన జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Update: 2020-07-29 16:55 GMT
అలనాటి టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, నిర్మలాదేవి దంపతులు నేడు 42వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి తన తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో క్యూట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసిన మంచు లక్ష్మి ....తనకు తెలిసిన అందమైన జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. వీరిద్దరూ తమ పెళ్లిరోజును సంతోషంగా జరుపుకోవాలని, ఇటువంటి జంట తమ తల్లిదండ్రులైనందుకు ఆనందంగా ఉందని మంచు లక్ష్మి పోస్ట్ చేశారు. ప్రేమ, వివాహ బంధం వంటి విషయాలలో తనకు తన తల్లిదండ్రులే ఆదర్శమని లక్ష్మి చెప్పారు. ప్రపంచంలోని ఆనందమంతా ఈ వివాహ వార్షికోత్సవ దినోత్సవంనాడు తమ ఇంట వెల్లివిరియాలని లక్ష్మి పోస్ట్ చేశారు.

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న ఆయన జన్మించారు. 1975లో  స్వర్గం నరకం చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యారు. మంచు విద్యాదేవిని తొలుత వివాహమాడిన మోహన్ బాబు ఆమె మరణించిన తర్వాత ఆమె సోదరి నిర్మలా దేవిని వివాహమాడారు. మోహన్ బాబు, విద్యాదేవిలకు మంచు విష్ణు, మంచు లక్ష్మి జన్మించగా...మోహన్ బాబు, నిర్మలాదేవిలకు మనోజ్ జన్మించారు. నటుడిగా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మోహన్ బాబు దాదాపు 573 సినిమాల్లో నటించారు. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
Tags:    

Similar News