ఇప్పుడంటే అందరూ బయోపిక్స్ మీద పడ్డారు కానీ అంతకుముందు ట్రెండ్ హారర్ లేదా హారర్ కామెడీలే. ఇక అవకాశాలు తగ్గిన హీరోయిన్లకు హారర్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా ఉండేది. అఫ్ కోర్స్.. ఇప్పుడు కూడా చాలామంది ఆ ట్రిక్కుని వాడుతున్నారు. త్రిష అదేబాటలో పయనిస్తూ 'మోహిని' గా మనల్ని భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈమధ్యే నిర్మాతలు 'మోహిని' ట్రైలర్ ను విడుదల చేశారు.
హారర్ సినిమాలో కామన్ గా కనిపించే థీమ్స్ రెండే. ఒకటి ఊరు చివర పాడుబడ్డ బంగాళా సెటప్.. రెండోది రివెంజ్ డ్రామా. ఇప్పుడు త్రిష కూడా 'మోహిని' అవతారమెత్తింది అందుకేనని ట్రైలర్ చూడడం మొదలుపెట్టిన కొద్ది సెకండ్ల లో మనకు డైరెక్టర్ దాచిపెట్టకుండా చెప్పాడు. స్టైలిష్ చెఫ్ గా త్రిష ను పరిచయం చేసిన వెంటనే కొన్ని వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం అంటూ ఒక షాట్..అంతలో లండన్ లో ఒక మర్డర్ జరిగినట్టు చూపిస్తారు. ఇంకోవైపు పగతో ఇన్నేళ్ళూ రగిలిపోయింది అంటూ మరో క్యారెక్టర్ తో చెప్పిస్తూ డైరెక్టర్ సస్పెన్స్ పెంచే ప్రయత్నం చేశాడు. సినిమాను ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరించారు.
సినిమాటోగ్రఫీ ట్రైలర్ లో స్టాండ్ అవుట్ గా నిలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా జానర్ కు తగ్గట్టుగా ఉంది. రెండు నిముషాల నిడివి గల ట్రైలర్ లో చాలా గ్రాఫిక్ షాట్స్ కూడా ఉన్నాయి గానీ 'బాహుబలి' కళ్ళతో చూస్తే కాస్త కష్టం. చూస్తుంటే సినిమాను అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందించినట్టుగా అనిపిస్తోంది. మరి నాయకిగా ఇంతకుముందే దెయ్యాల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష ఇప్పుడు మోహినిగా ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి. 'మోహిని' సినిమాకు దర్శకుడు మాదేష్ కాగా మార్వెల్ వర్త్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
Full View