పుష్ప 2: ఓటీటీకి వచ్చేసరికి మరో సర్ ప్రైజ్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. టీజర్, ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం సినిమాకు మునుపెన్నడూ లేని బజ్ తెచ్చింది.
పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. సినిమా విడుదలైన తొలి రోజే అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ రన్‌ను కొనసాగిస్తూ భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ భాషలో తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్‌ను మరింత విస్తరించేలా పుష్ప 2 ఒక నమ్మకం కలిగించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ కలెక్షన్లను సాధించింది. సినిమా మొత్తం మీద 1800 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఇది తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లిన విజయం. అన్ని భాషల్లోనూ పెద్ద మొత్తంలో షేర్‌ను రాబట్టి, అల్లు అర్జున్ క్రేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు సినిమా ఓటీటీలోకి వస్తుండగా పుష్ప 2: ది రూల్ కోసం మరో 10 నిమిషాల అదనపు ఫుటేజ్ రెడీగా ఉందట.
ఈ ఫుటేజ్ ఇప్పుడు వరకు థియేటర్లలో చూపించలేదు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూసే ప్రేక్షకులకు ఇది మరో కొత్త అనుభూతిని కలిగించబోతోంది. 3 గంటల 15 నిమిషాల నిడివితో సినిమా ప్రారంభమైతే, రీసెంట్‌గా 20 నిమిషాల ఫుటేజ్‌తో 3 గంటల 35 నిమిషాలుగా మారింది. ఎక్స్ ట్రా సీన్స్ తో పాజిటివ్ గా రెస్పాన్స్ అందుకున్న పుష్ప 2 ఇప్పటికి మంచి కలెక్షన్లు అందుకుంటోంది.
ఇక ఓటీటీలో వచ్చే సమయానికి ఈ చిత్రం మొత్తం 3 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. థియేటర్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు వచ్చే ఈ మార్పులతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించే అవకాశముంది. మరి ఈ కొత్త కంటెంట్‌తో ఓటీటీలో కూడా పుష్ప 2 ఎలా దూసుకుపోతుందో చూడాలి.