బాలీవుడ్ లో సౌత్ భామల హవా..!

ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ కు బాలీవుడ్ లో అంతగా డిమాండ్ ఉండేది కాదు ఒకరిద్దరు ట్రై చేసినా ఏదో ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకునే వారు.

Update: 2025-01-18 22:30 GMT

ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ కు బాలీవుడ్ లో అంతగా డిమాండ్ ఉండేది కాదు ఒకరిద్దరు ట్రై చేసినా ఏదో ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకునే వారు. ఐతే ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ లో సౌత్ కథానాయికల హవా అదిరిపోతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలతో సౌత్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ఇక వారి క్రేజ్ కి తగినట్టుగానే రెమ్యునరేషన్ లో కూడా సూపర్ అనిపించేస్తున్నారు. ఐతే తెలుగు, తమిళ సినిమాల్లో చేసిన ఈ స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ కి వెళ్లే సరికి డబుల్ ట్రిపుల్ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లి అదరగొట్టేస్తున్న వారిలో రష్మిక ముందు వరుసలో ఉంది. అమ్మడు ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్టే అవుతుంది. అందుకే రష్మిక డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో రష్మిక రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుందని టాక్. తెలుగు లో ఐతే 2, 3 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక బాలీవుడ్ లో సినిమాకు 8 నుంచి 10 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

మరోపక్క సమంత కూడా బాలీవుడ్ వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతుంది. సమంత సిటాడెల్ సీరీస్ కు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని అంటున్నారు. పూజా హెగ్దే, సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ కూడా సౌత్ సినిమాల్లో 3, 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ రేంజ్ ఉంటే బాలీవుడ్ కి వెళ్తే ఆ ఫిగర్ డబుల్ అవుతుందని తెలుస్తుంది.

అందుకే బాలీవుడ్ సినిమాల మీద ఈ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఐతే తెలుగులో చేస్తూ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తక్కువ రెమ్యునరేషన్ అందుకున్నా ఆ ఇంపాక్ట్ నేషనల్ లెవెల్ లో ఉంటుందని అలా ఫిక్స్ అయ్యారు. ఏది ఏమైనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా సౌత్ హీరోయిన్స్ వెంట పడటం చూస్తుంటే అక్కడ కూడా మన హీరోయిన్స్ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. కచ్చితంగా ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం బాలీవుడ్ భామలను సైతం వెనక్కి నెట్టే పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బీ టౌన్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేలా సౌత్ కథానాయికలు అదరగొట్టేస్తున్నారు.

Tags:    

Similar News