నటసింహా నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించే అందరిలోనూ ఆసక్తికర చర్చ. మోక్షజ్ఞ ఇప్పట్లో రాడు, ఎడ్యుకేషన్ పూర్తవ్వాలి అని బాలయ్య ఎప్పట్నుంచో్ చెబుతున్నారు. ఇప్పటికైతే హీరో అయ్యే ఛాన్సే లేదు. 2015, 2016లో మోక్షజ్ఞ ఎంట్రీ లేదు. 2017లో అతడు ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అప్పటికి అతడు చదువులు పూర్తి చేసుకుని సమరానికి సన్నద్ధంగా ఉంటాడు.
ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్సుల్లో శిక్షణ పొందుతున్నాడు... ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఇప్పటికే బోలెడుమంది దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. రేసులో కొరటాల శివ పేరు కూడా వినిపిస్తోంది. బోయపాటి శ్రీను, వినాయక్, కొరటాల శివ వీళ్లలో ఎవరో ఒకరికి అవకాశం ఉందనే చెబుతున్నారు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను నారా రోహిత్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో నందమూరి, నారా అభిమానుల సమక్షంలో మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. హీరో నారా రోహిత్ ఈ వేడుకలను కేక్ కటింగ్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ మోక్షజ్ఞకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశాడు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నటసింహా వారసుడిగా మోక్షజ్ఞ తండ్రి లెగసీని నిలబెట్టడం అంటే ఆషామాషీ కాదు. అతడు వస్తూనే పెను సంచలనం సృష్టించాలి. తండ్రికి మాస్ లో అసాధారణమైన ఫాలోయింగ్ ఉంది. ఆ మాస్ ని మెప్పించే అప్పియరెన్స్ తనలో ఉందని నిరూపంచుకోవాలి. కాబట్టి మోక్షజ్ఞ ముందు పెను సవాల్ ఉన్నట్టే.