శాతకర్ణి కొడుకు.. బాలయ్య కొడుకే

Update: 2017-01-19 04:33 GMT
నందమూరి బాలకృష్ణ ఎప్పటినుండో తన తనయుడు మోక్షజ్ఞ ఆరంగేట్రం గురించి క్లియర్ గా ఏమీ చెప్పట్లేదు కాని.. ప్రస్తుతం ఫారిన్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్న ఈ కుర్రాడు.. త్వరలోనే తెరపైకి వస్తాడని బాలయ్య స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య ఏమన్నారంటే.. ప్రస్తుతం కేవలం తన స్టడీస్ పైనే మోక్షజ్ఞ ఫోకస్ చేస్తున్నప్పటికీ.. ఎలాగైతే బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలను చూసి నటనాకౌసల్యం నేర్చుకున్నారో.. అలాగే మోక్షజ్ఞ కూడా తన సినిమాలను చూసి అన్నీ నేర్చుకుంటున్నాడని సెలవిచ్చారు. ఇంకా మోక్షజ్ఞ కోసం ఏ సబ్జెక్టు ఫైనల్ చేయలేదని బాలయ్య చెబుతున్నప్పటికీ.. నిజానికి క్రిష్‌ తీయబోయే ''వాశిష్టిపుత్ర పులోమావి'' సినిమాతో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడం తద్యం అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

ఆల్రెడీ బాలయ్య శాతకర్ణిగా చేశారు కాబట్టి.. ఆ సినిమాకు సీక్వెల్ గా చేసే సినిమాలో పులోమావి మహా చక్రవర్తిగా ఆయన కొడుకు నటిస్తేనే కరక్ట్ అని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. దానికితోడు బాలయ్య ఈ సినిమాను తన హోమ్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి శాతకర్ణి కొడుకుగా బాలయ్య కొడుకే కనిపించడం అభిమానులకు కిక్కిచ్చే విషయమే.

అయితే ఇప్పటికే క్రిష్‌ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఒకటి వెంకటేష్‌ సినిమాకాగా రెండోది హిందీలో అక్షయ్ కుమార్ తో ఒక సినిమా. ఈ మధ్యలో మరి మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ వినిపిస్తాను అన్నాడు. కాబట్టి పులోమావి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది అప్పుడే చెప్పలేం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News