బాలయ్య గురించి మోక్షజ్న ఏమంటున్నాడు?

Update: 2016-03-27 11:30 GMT
నందమూరి మోక్షజ్న.. రెండు మూడేళ్లుగా నందమూరి అభిమానుల నోళ్లల్లో నానుతూనే ఉంది ఈ పేరు. బాలయ్య వారసత్వాన్ని అందుకుని ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని అభిమానులు ఈ కుర్రాడి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం వచ్చే సంవత్సరమే సినిమాల్లోకి అడుగపెట్టేస్తున్నాడు మోక్షజ్న. ఐతే ఇప్పటిదాకా మోక్షజ్న ఎప్పుడూ మీడియాలో కనిపించింది లేదు. మీడియా వాళ్లతో మాట్లాడింది లేదు. ఐతే బాలయ్య వారసుడిని తొలిసారి మాట్లాడించిన అతడి వాయస్ ను ప్రచురించిన ఘనత ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ కే దక్కుతుంది. ఈ మ్యాగజైన్.. ఇటీవలే నందమూరి బాలకృష్ణ మీద ఓ ప్రత్యేక ఎడిషన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇందుల భాగంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు సంబంధించి కూడా ఓ కాలమ్ ప్రచురించారు. ఈ సందర్భంగా తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మోక్షజ్న. తన తండ్రితో తనకున్న అనుబంధం గురించి మోక్షజ్న మాట్లాడుతూ.. తన తండ్రి తనను ఒక స్నేహితుడిలాగా చూస్తాడని చెప్పాడు. తనను చదువుకోమని గానీ.. సినిమాల్లోకి రమ్మని గానీ బాలయ్య ఒత్తిడి చెయ్యలేదని చెప్పాడు. తన కెరీర్ పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తన తండ్రి తనకే వదిలేశారని.. అందుకు ఆయనకు కృతజ్నతలు చెబుతానని మోక్షజ్న అన్నాడు. తాను కచ్చితంగా తన తండ్రి - తాతయ్య నందమూరి తారక రామారావు వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తానని.. అభిమానుల అంచనాలను అందుకుంటానని మోక్షజ్న తెలిపాడు.
Tags:    

Similar News