గుజరాతీ ముద్దుగుమ్మ మోజాల్ గజ్జర్ చాలా సంవత్సరాల క్రితమే తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కొన్ని సినిమాల్లో నటించిన మోనాల్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో మలయాళం మరియు తమిళంలో కూడా చేసింది. అక్కడ ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో సౌత్ కు షిప్ట్ అయ్యింది. దాదాపు మూడు సంవత్సరాలు సౌత్ లో ఉన్న మోనాల్ మలయాళం వ్యక్తితో ప్రేమ విఫలం అవ్వడంతో సౌత్ ఇండియాను వదిలేసి వెళ్లి పోయింది. ఉత్తరాదిన మరాఠీ గుజరాతీ సినిమాలు చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీజన్ 4 లో లవ్ ట్రాక్ ను నడిపించిన మోనాల్ గజ్జర్ కు అనూహ్యంగా బిగ్ బాస్ కూడా మద్దతు ఇచ్చాడని ఆమెను ఎలిమినేట్ కాకుండా కాపాడారు అంటూ పుకార్లు వచ్చాయి. చివరి వారం వరకు కూడా మోనాల్ ను కంటిన్యూ చేసి అందరికి షాక్ ఇచ్చారు. మోనాల్ బిగ్ బాస్ తర్వాత మళ్లీ కెరీర్ పరంగా బిజీ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ చేసింది. అంతే కాకుండా ఓంకార్ చేస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమంలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. దాంతో మళ్లీ ఈ అమ్మడు హైదరాబాద్ కు షిప్ట్ అవ్వబోతున్నట్లుగా పేర్కొంది.
చాలా రోజుల తర్వాత తన సొంత ప్రాంతం అహ్మదాబాద్ కు వెళ్లిన మోనాల్ అతి త్వరలోనే హైదరాబాద్ రాబోతున్నాను. అక్కడే ఉంటాను అంది. ఈ అమ్మడు బిబి హౌస్ లో ఉన్న సమయంలో అఖిల్ తో సన్నిహితంగా ఉంది. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. దాంతో వీరిద్దరు కలిసి జీవించబోతున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.