దర్శకుడు కం నటుడు ఎస్జే సూర్య హీరోగా రూపొందిన మాన్స్టర్ టీజర్ విడుదలైంది . ఓ ఎలుక చేసే విధ్వంసాన్ని అల్లరిని కాన్సెప్ట్ గా తీసుకుని నెల్సన్ వెంకటేషన్ రూపొందించిన ఈ మూవీకి డియర్ కామ్రేడ్ ఫేం జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. నిమిషం లోపే ఉన్న టీజర్ లో కంటెంట్ గురించి క్లియర్ గా చెప్పేశారు. హీరో జీవితంలో ఎలుక ప్రవేశించడం అతని ప్రియురాలితో పాటు స్నేహితులను ఇబ్బంది పెట్టడం ఆఖరికి వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం అంతా సరదాగా గడిచిపోయేలా తీసినట్టు కనిపిస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్ కాబట్టి ఎలుక బాగానే సెట్ అయ్యింది. మహేష్ బాబు స్పైడర్ లో విలన్ గా చేసిన ఎస్ జే సూర్యని ఇందులో హీరోగా చూడటం మనవాళ్ళకు కొంచెం కష్టమైన పనే కాని అక్కడ ఆల్రెడీ చాలా చేశాడు కాబట్టి తమిళ్ లో ఇబ్బంది లేదు. ఇలాంటి ఎలుక కథలు మనకు కొత్త కాదు. చాలా ఏళ్ళ క్రితమే దర్శకుడు రేలంగి నరసింహారావు గారు ఎలుకా మజాకా అనే సినిమా తీశారు.
అంతగా సక్సెస్ కాలేదు కాని అందులో స్టొరీ కూడా ఇంచుమించు ఇదే తరహలో ఉంటుంది. ఎలుక ఈగ అంటూ మనవాళ్ళు ఎప్పుడో చేసేసిన జానర్స్ ని కోలీవుడ్ లో కాస్త ఆలస్యంగా టచ్ చేస్తున్నారన్న మాట. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కావడంతో హీరొయిన్ ప్రియా భవానికి పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించడం లేదు. ఏదో అలా మొక్కుబడిగా చూపించారు. గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం అందించిన మాన్స్టర్ ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు
Full View