అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగే విధంగా రోజుకో వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఒకటి రెండు రోజులుగా పుష్ప సినిమాలో ఒక పాటలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పుష్ప సినిమా రేంజ్ ను మరింతగా పెంచిన ఈ చిరు సర్ ప్రైజ్ న్యూస్ పై ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ నిజం కాకపోవచ్చు అంటూ కొందరు అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం పుష్ప లో చిరు గెస్ట్ అప్పియరెన్స్ ఉంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులను ఈ విషయమై సంప్రదించగా అనధికారికంగా వారు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. చిరంజీవి గారు పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ లో కేవలం రెండు స్టెప్పులు వేయబోతున్నాడు. బన్నీతో చిరంజీవిని గతంలో పలు సార్లు చూశాం. కాని పుష్పలో కనిపించబోతున్న వీరిద్దరి లుక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పుష్ప ఐటెం సాంగ్ ను దిశా పటానీతో చేయించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ లు పునః ప్రారంభం అయిన వెంటనే ఐటెం సాంగ్ చిత్రీకరణ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
రెండు నుండి మూడు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొదటి పార్ట్ పై బజ్ క్రియేట్ చేసేందుకు గాను చిరంజీవితో రెండు స్టెప్పులు వేయిస్తున్న మేకర్స్ రెండవ పార్ట్ లో కూడా మరో స్టార్ ను గెస్ట్ గా తీసుకు వస్తారేమో చూడాలి. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. రెండు పార్ట్ లు కలిపి 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా పుష్ప మొదటి పార్ట్ విడుదల కాబోతుంది. ఇక రెండవ పార్ట్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారట.