26/11 రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేషు ప్రధాన పాత్రలో రూపొందిన పాన్ ఇండియా మూవీ మేజర్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశారు. రియల్ హీరో జీవిత కథ కనుక ఖచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే అడవి శేషు గత చిత్రాల ట్రాక్ రికార్డ్ మరియు మేజర్ సినిమా యొక్క ప్రత్యేకత నేపథ్యంలో ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాదిలోనే రావాల్సిన ఈ సినిమా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఇప్పుడు ఈ ఏడాదిలో కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ఒక సినిమా కారణంగా మేజర్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం విడుదల తేదీ విషయంలో మేకర్స్ చర్చలు జరుగుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ లో రూపొందిన 'మేజర్' సినిమాకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఓ బాలీవుడ్ సినిమా కూడా ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో సాగింది. ఆ సినిమాలో కార్గిల్ యుద్ద హీరోల గురించి చూపించడం జరిగింది. ఆ సినిమాకు ఈ సినిమా కు చాలా వరకు దగ్గర పోలికలు సహజంగానే ఉంటాయి. కనుక ఆ సినిమా ను చూసిన వారు మేజర్ ను చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం. అందుకే మేజర్ సినిమా విడుదల తేదీని పొడగిస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఆ బాలీవుడ్ సినిమా సందడి తగ్గిన తర్వాత.. ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం మర్చిన తర్వాత మన మేజర్ ను విడుదల చేయాలని కొందరి సలహా. మరి మూవీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు అలాంటి చర్చ గురించి ఎలాంటి స్పందన రాలేదు. మేజర్ విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వాలనుకున్న ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ బాలీవుడ్ మూవీ కనుక మేజర్ ను ఈ ఏడాది చివరి వరకు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యుల నిర్ణయం ఏంటీ అనేది చూడాలి. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో అడవి శేషుకు జోడీగా సాయి మంజ్రేకర్ మరియు శోభిత దూళిపాల లు నటించారు.