2019 మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీస్‌

Update: 2019-01-02 01:30 GMT
కాల గమనంలో 2018వ సంవత్సరం కలిసి పోయింది. నేటి నుండి 2019వ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2018వ సంవత్సరం టాలీవుడ్‌ కు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సాగింది. 2018 సంవత్సరం సంక్రాంతి సీజన్‌ తో ప్రారంభం అయ్యింది. అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. మార్చిలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం నుండి సక్సెస్‌ లు ఆరంభం అయ్యాయి. ఆ తర్వాత పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇక 2019వ సంవత్సరం సంక్రాంతి నుండి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లతో ఆరంభం అయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

2019లో ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్‌’ మరియు ‘వినయ విధేయ రామ’ చిత్రాలు గత కొన్ని నెలుగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను దక్కించుకుంటాయని మెగా మరియు నందమూరి ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌ లుగా రాబోతుంది. ఆ రెండు పార్ట్‌ లు కూడా బాలయ్య కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ వసూళ్లను దక్కించుకుంటాయని ఫ్యాన్స్‌ విశ్వాసంగా ఉన్నారు. ఇక రంగస్థలం చిత్రం తర్వా చరణ్‌ చేస్తున్న మూవీ అవ్వడంతో వినయ విధేయ రామ చిత్రంపై అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. ఇదే సంక్రాంతికి రాబోతున్న ఎఫ్‌ 2 చిత్రం మల్టీస్టారర్‌ మరియు కామెడీ ఎంటర్‌ టైనర్‌ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక మూవీగా ‘మిస్టర్‌ మజ్ను’ను చెప్పుకోవచ్చు. మొదటి రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చడంతో అఖిల్‌ ఈ చిత్రంకు చాలా గ్యాప్‌ తీసుకుని నటించాడు. ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు - అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. చిన్న హీరో అయిన నిఖిల్‌ నటించిన ‘ముద్ర’ చిత్రం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వైఎస్‌ ఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ కూడా సినీ మరియు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి ఈ చిత్రంలో వైఎస్‌ పాత్రను పోషించడం విశేషం.

అల్లు హీరో అల్లు శిరీష్‌ నటిస్తున్న ‘ఏబీసీడీ’ చిత్రం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రాలే కాకుండా ‘మహర్షి’ - ‘సైరా’  - ‘సాహో’ - ‘జెర్సీ’ - ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలు కూడా 2019లో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లుగా నిలవడం ఖాయం అంటూ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ఇంకా కొన్ని టైటిల్స్‌ ఖరారు కాని చిత్రాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.







Full View

Tags:    

Similar News