దక్షిణాది సినిమాల గురించి ఇప్పుడు దేశం మొత్తమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురుచూస్తున్నారని అనడం అతి శయోక్తి కాదు. వరుసగా మన సినిమాలు అంతగా సక్సెస్ సాధించడమే కాదు.. టెక్నికల్ గా అంతటి బ్రిలియన్స్ తో రూపొందుతున్నాయి. అయితే.. ఎప్పటికప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉంటునే ఉంటాయి. వీటిలో అత్యధికంగా వేటికోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారనే సంగతులు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి.
ప్రస్తుతం దక్షిణాదిలో రూపొందుతున్న సినిమాల్లో.. నాలుగు ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రజినీకాంత్- శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 2.ఓ.. ఏడాదికి పైగా జనాలను ఊరిస్తూనే ఉంది. బాహుబలితో సెన్సేషన్ సృష్టించిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో కూడా ఇప్పుడు నేషనల్ ప్రాజెక్టు అనే సంగతి తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ సినిమా సత్తా పెరిగిన తర్వాత.. తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి ని కూడా భారీ బడ్జెట్ తో జాతీయ స్థాయిలోనే రూపొందిస్తున్నారు మెగాస్టార్. వీటితో పాటు రీసెంట్ గా అనౌన్స్ చేసిన రాజమౌళి మూవీ #RRRగురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి.
ఈ నాలుగు సినిమాలు ఆసక్తిగానే ఉన్నా.. దక్షిణాది మొత్తంగా ఉన్న క్రేజ్ ప్రకారం చూసుకుంటే మాత్రం.. రజినీకాంత్ మూవీ 2.ఓ.. రాజమౌళి RRR గురించే జనాల్లో ఎక్కువగా ఆసక్తి ఉంది. విచిత్రం ఏంటంటే.. మిగిలిన సినిమాలు అన్నీ షూటింగ్ దశలో ఉండగా.. రాజమౌళి-రామ్ చరణ్- ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండగానే క్రేజ్ లో మాత్రం దూసుకుపోవడమే.