అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల అయ్యింది. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను బ్యాచిలర్ రాబడుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా పాతిక కోట్ల వసూళ్లను దక్కించుకుందనే టాక్ వినిపిస్తుంది. లాంగ్ రన్ లో మరో పాతిక కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. దసరాకు వచ్చిన మరో సినిమా పెళ్లి సందడి నిరాశ పర్చింది. ఆ సినిమా టాక్ మరియు ఈ సినిమా టాక్ రెండింటిన పరిశీలిస్తే ఖచ్చితంగా బ్యాచిలర్ కు ఎక్కువ స్కోప్ ఉందని అంతా అంటున్నారు.
అలాంటి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే నవంబర్ లో దీపావళి సందర్బంగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని అంటున్నారు. లవ్ స్టోరీ విడుదల అయిన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు కనుక ఈ సినిమాను కూడా నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ చేస్తారేమో అంటూ అంతా భావిస్తున్నారు. అందుకే ఎలాగూ స్ట్రీమింగ్ అవ్వబోతుంది కనుక ఎందుకు థియేటర్ లో వందలకు వందలు పెట్టి చూడటం అంటూ అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ నిర్మాత బన్నీ వాసు స్పందించాడు.
ట్విట్టర్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా స్ట్రీమింగ్ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పాడు. ఆయన ఈ సినిమా స్ట్రీమింగ్ కు ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా నెల రోజుల తర్వాత మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వదు అంటూ తేల్చి చెప్పాడు. నెల కంటే ఎక్కువ సమయం ఉంటే కనుక థియేటర్లలో ఎక్కువ మంది చూస్తారు. థియేటర్లలో ఎక్కువ శాతం జనాలు చూడాలనే ఉద్దేశ్యంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వబోతున్నట్లుగా నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు. ఈ విషయంలో బన్నీ వాసు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.
ఇప్పట్లో బ్యాచిలర్ ను ఓటీటీలో చూస్తాం అనే ఆశతో ఉన్న వారు ఆ ఆశలు వదిలేసి థియేటర్ కు వెళ్లడం బెటర్ అంటూ బన్నీ వాసు ప్రకటన ఉంది. థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతున్న సినిమాను ఎందుకు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారు.. బ్యాచిలర్ సినిమా రెండు వారాల పాటు బాక్సాఫీస్ సందడి చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖిల్ కు మొదటి కమర్షియల్ హిట్ దక్కిందంటూ అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.