స్పెషల్‌ గా మళ్లీ రాబోతున్న బ్యాచిలర్‌

Update: 2021-11-16 04:05 GMT
అఖిల్ అక్కినేని ఎప్పుడెప్పుడు కమర్షియల్ సక్సెస్‌ ను దక్కించుకుంటాడా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ఆ సక్సెస్ దక్కింది. మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చిన నేపథ్యంలో అఖిల్‌ చేసిన బ్యాచిలర్ సినిమా పై అందరి చూపు ఉండగా విడుదల అయ్యింది. సినిమా కు పాజిటివ్ రెస్సాన్స్ రావడం మాత్రమే కాకుండా మంచి వసూళ్లను కూడా దక్కించుకుంది. అల్లు అరవింద్ సమర్పరణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ కు పోటీగా మరో రెండు సినిమాలు వచ్చినా కూడా వాటన్నింటిలో పై చేయి సాధించి దసరా విజేతగా నిలిచింది. అఖిల్‌ కెరీర్ లో మొదటి సారి కమర్షియల్‌ హిట్ ను దక్కించుకున్నాడు. అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్‌ ఈవెన్‌ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్‌. సినిమా విడుదల అయ్యి నెల రోజులు అవుతోంది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయాలనుకున్న కూడా కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యారు.

నవంబర్‌ 19న మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. మొదట ఈ సినిమా ను ఆహా లోనే స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని చివరి నిమిషంలో నెట్‌ ఫ్లిక్స్ వారు కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇలా ఒకే సినిమాను రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్‌ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆహా తో పాటు నెట్‌ ఫ్లిక్స్ లో కూడా ఒకే సమయంలో అంటే నవంబర్ 19న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అల్లు అరవింద్‌ నిర్మించిన సినిమా అవ్వడం వల్ల సహజంగానే ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వడం జరుగుతుంది. కాని నెట్‌ ఫ్లిక్స్ వారు ఆహా లో స్ట్రీమింగ్‌ అయినా కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఒకే సారి రెండు ఓటీటీ ల్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుండటంతో స్పెషల్‌ అన్నట్లుగా కామెంట్స్‌ వస్తున్నాయి.

కరోనా వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన సమయంలో థియేటర్ కు వెళ్లి చూడాలని చూడలేక పోయిన ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఓటీటీ లో సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి పుకార్లు వచ్చిన సమయంలో ఖచ్చితంగా నెల రోజులకే ఈ సినిమా ఓటీటీ లో రాదని.. సమయం పడుతుందని.. కనుక థియేటర్లకు వచ్చి సినిమాను చూడాల్సిందిగా చిత్ర యూనిట్‌ సభ్యులు కోరారు. రెండు మూడు వారాల వరకు బాగానే వసూళ్లను దక్కించుకున్న బ్యాచిలర్‌ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేక పోయాడు. అందుకే సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం చేశారు. నెల రోజుల్లోనే విడుదల చేస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ బ్యాచిలర్ గా ఓటీటీ లో కూడా సక్సెస్ ను దక్కించుకోబోతున్నాడో చూడాలి.
Tags:    

Similar News