యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. దసరా సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులకలను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద యాభై కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కినేని వారసుడి కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అనిపించుకుంది.
థియేటర్లలో ఘనవిజయం సాధించిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రం ఆహా ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్ సాధించింది. ఈ క్రమంలో ఇటీవల 'స్టార్ మా' ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైంది. అయితే తాజాగా అఖిల్ సినిమాకు వచ్చిన టీఆర్పీ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి 9.31 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్లికి ముందు జీవితం.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలనే కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆధునిక జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్న రిలేషన్షిప్ సమస్యను.. పెళ్లి అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ను యూత్ కి మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడు ఇది బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించినట్లు రేటింగ్ చూస్తే అర్థం అవుతోంది. ఇక అదే వీకెండ్ లో టెలికాస్ట్ అయిన 'అరణ్య' చిత్రానికి 5.09 రేటింగ్.. 'SR కళ్యాణమండపం' సినిమాకి 4.82 టీఆర్పీ వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈషా రెబ్బా - నేహా శెట్టి - ఫారియా అబ్దుల్లా అతిథి పాత్రలో కనిపించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చగా.. ప్రదేశ్ శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.