అమ్మ క్యారక్టర్లకు ఫుల్‌ గ్లామర్‌!!

Update: 2015-07-01 05:14 GMT
మొన్నటివరకు సినిమాల్లో మమ్మీ క్యారెక్టర్లు చేయాలంటే.. పూరి జగన్‌ వంటి డైరక్టర్లు అయితే రమాప్రభ లేకపోతే జయసుధ అనే నానుడి తీసుకొచ్చారు. ఇకపోతే మొన్ననే కొరటాల శివ మిర్చి సినిమాతో నదియాను ఇంట్రొడ్యూస్‌ చేసి మాంచి గ్లామరస్‌ అమ్మగా చూపించాడు. గ్లామరస్‌ అంటే మీరు అనుకునే రస్‌ కాదు.. కాస్త క్యూట్‌గా స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌గా ఉండే మమ్మీ.. ఈ ప్రయోగం ఇప్పుడు ఏ లెవెల్‌కు వెళ్లిపోయిందంటే...

ఆ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ రోజా బ్యూటి మధుబాలను దించాడు. ఈ మధ్యలో చాలామంది హీరోయిన్లు అమ్మల వేషాలు వేశారు కాని వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడేమో మహేష్‌ బాబు సినిమాలో సుకన్య అమ్మగా చేస్తోంది. ఈవిడ గతంలో ప్రభస్‌ సినిమాలో చేసినా అంతగా బ్రేక్‌ రాలేదు. ఇకపోతే ఈ హాట్‌ మమ్మీల యవ్వారం ఇక్కడితో ఆగట్లేదు. మరో సినిమాలో మహేస్‌ మథర్‌గా రేవతి నటిస్తోంది. ఇప్పటికే బన్నీకి అమ్మగా పవిత్రలోకేష్‌, ఎన్టీఆర్‌ సినిమల్లో సుహాసినీ, అలాగే ముదిరిపోయిన మథర్‌గా నిత్యా మీనన్‌.. ఇలాంటి మమ్మీలను కూడా ఇప్పుడు ముడతలు పడని ముఖాలనే ఎంచుకుంటున్నారు. ఎలా చూసినా కూడా ఈ క్యారెక్టర్స్‌కు ఇప్పుడు ఫుల్‌ గ్లామర్‌ అద్దేస్తున్నారు తెలుగు మేకర్స్‌. అది సంగతి.

Tags:    

Similar News