సినిమా ఆన్‌సెట్స్ ఉండగానే ఫోటోల్ని, వీడియోల్ని లీక్ చేసి బెంబేలెత్తించే లీకువీరులు ఎందరో ఉన్నారు. ఎంత కఠినమైన ఏర్పాట్లు చేసినా కూడా ఏదో ఒక లూప్ లైన్ వెతికేసి కంటెంట్‌ను ల్యాబ్ నుండో ఎడిట్ సూట్ నుండో లీకేజీ చేసేస్తున్నారు. తలనొప్పిగా మారిన ఈ లీకులు ఈ మధ్యనే హెల్ప్ కూడా చేశాయని కొందరి వాదన.
అప్పట్లో అత్తారింటికి దారేది చిత్రం ప్రథమార్థాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేసి గందరగోళం సృష్టించాడో ప్రబుద్ధుడు. సినిమా రిలీజ్‌కి ఒక రోజు ముందు ప్రథమార్థం ఆన్‌లైన్‌లో చూసేశారు జనం. అదే కోవలో ఆ తర్వాత 'బాహుబలి' చిత్రం ఆన్‌సెట్స్ ఉండగానే ఈ సినిమాకి సంబంధించిన 12 నిమిషాల రా ఫుటేజ్‌ని లీక్ చేశాడో లీకు వీరుడు. విఎఫ్‌ఎక్స్ టీమ్‌కి సంబంధించిన ఒకానొక టెక్కీ ఈ పని చేసి జైలు పాలయ్యాడు. ఇక ఇటీవలే మలయాళంలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ప్రేమం చిత్రాన్ని పూర్తిగా పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు ఎవరో. పైగా అది స్వయంగా సెన్సార్ వారికి ఇచ్చిన కాపీని ల్యాబ్ నుండి లీకేజ్ చేశారని తేలింది. దీనిపై ఇటీవలి కాలంలో ఓ యుద్ధమే జరిగింది. థియేటర్లు మూయించి నానా హడావుడి చేశారు మల్లూ బాబులు.
అయితే ఈ మూడు సినిమాల విషయంలో ఒకటే కామన్ పాయింట్. ఆ పాయింట్ వల్లే కావాల్సినంత ప్రచారం వచ్చేసింది. అందుకు తగ్గట్టే రిలీజయ్యాక బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టాయి. దీన్నిబట్టి పైరసీలు, లీకేజీలు సదరు సినిమా ప్రమోషన్‌కి ఉపయోగపడి అవి హిట్టవ్వడానికి సాయపడ్డాయని అనుకోవచ్చు.