స్టార్స్ మద్దతుతో డైరెక్టర్ సమస్య తీరినట్లేనా..?

Update: 2021-04-16 11:06 GMT
స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ప్లాప్స్ లో ఉన్నటువంటి శంకర్.. తాజాగా అపరిచితుడు సినిమా హిందీ రీమేక్ అనేది పెద్దసమస్యగా మారింది. ఎందుకంటే అసలే ఓవైపు భారతీయుడు సీక్వెల్ మూవీ ఆగిపోయింది. కొత్తగా సినిమాలు ప్రకటించేసరికి ఇక మళ్లీ శంకర్ స్పీడ్ పెంచాడని అనుకున్నారు. స్టార్ హీరో రాంచరణ్ తో పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రకటించిన డైరెక్టర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించాడు. ఆ అపరిచితుడు రీమేక్ ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడే సమస్య మొదలైంది. ఆ సినిమా ఎవరిని అడిగి రీమేక్ చేస్తున్నావ్.. సర్వహక్కులు నావే అంటూ ప్రొడ్యూసర్ ఆస్కార్ వి రవిచంద్రన్ నోటిస్ లెటర్ రాసారు.

దానికి స్పందించిన శంకర్.. ఆ సినిమా కథా రచయిత నేను.. కాబట్టి సర్వహక్కులు నాకే ఉన్నాయని స్ట్రాంగ్ గా బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వివాదం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దచర్చకే దారితీసింది. కానీ ఈ విషయంలో పూర్తి మద్దతు మాత్రం డైరెక్టర్ శంకర్ కే లభిస్తుంది. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ దర్శకులు, ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారంతా సపోర్ట్ గా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తూ వారి మద్దతు ప్రకటిస్తున్నారు. అపరిచితుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అరివళగన్.. ఆ స్టోరీ హక్కులు దర్శకుడివే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా సోషల్ మీడియాలో #isupportdirectorshankar అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్నారు. ఏదేమైనా డైరెక్టర్ వెనుక పెద్దసంఖ్యలో మద్దతుదారులు నిలబడ్డారు. ఇదిలా ఉండగా.. శంకర్ - రవిచంద్రన్ కలిసి ఐ సినిమా కూడా చేశారు. ఆ ప్లాప్ కారణంగానే నిర్మాత శంకర్ పై ఇలా కక్ష కట్టాడని టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికైనా శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ వైపు అడుగులేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News