చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమా అనేసరికి అందరికీ గుర్తుకు వచ్చే సినిమా 'జగదేకవీరుడు - అతిలోక సుందరి'. 1990 మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అమ్రిష్ పురి అద్భుతంగా నటించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇళయరాజా స్వరపరిచిన బాణీలతో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాను ఎవరూ మరిచిపోలేదు.
కథ .. కథనాలు .. పాటలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకుని వెళ్లాయి. 'అతిలోక సుందరి' అంటే శ్రీదేవినే అనే పేరు ఈ సినిమాతో స్థిరపడిపోయింది. అంత గ్లామరస్ గా ఆమెను చూపించారు. చిరంజీవి - శ్రీదేవి కాకుండా ఈ పాత్రలలో వేరెవరినీ ఊహించుకోలేం అన్నంత గొప్పగా వాళ్లు ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాకంటే ముందుగా చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్లో రెండు సినిమాలు రావలసింది .. కానీ కుదరలేదు అనే విషయం చాలా తక్కువ మందికి గుర్తుండి ఉంటుంది.
చిరంజీవి హీరోగా శ్రీదేవి కథానాయికగా 'వజ్రాలదొంగ' సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందవలసి ఉంది. ఈ సినిమా నిర్మాత ఎవరో కాదు శ్రీదేవినే. అప్పట్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గానే జరిగాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎంజీఆర్ హాజరయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇంతా చేస్తే ఈ సినిమా షూటింగు మధ్యలోనే ఆగిపోయింది. కారణాలేవైనా మళ్లీ మనసు మార్చుకోలేనంతగా అటకెక్కేసింది. ఆ తరువాత 'కొండవీటి దొంగ' సినిమా కోసం కూడా శ్రీదేవిని సంప్రదించగా ఆమె అంతగా ఆసక్తిని చూపించలేదని అంటారు.
'వజ్రాల దొంగ' మాదిరిగానే చిరంజీవి చేయవలసిన సినిమాలు చాలానే ఆగిపోయాయని చెబుతారు. వర్మతో చేయవలసిన 'చెప్పాలని వుంది' .. సురేశ్ కృష్ణతో చేయవలసిన 'అబు .. బగ్దాగ్ గజదొంగ' .. సింగీతంతో చేయవలసిన 'భూలోక వీరుడు' .. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దివ్యభారతి కథానాయికగా చేయవలసిన సినిమా .. ఇలా ఇంకా ఎన్నో సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఈ జాబితా చూస్తే చిరంజీవి ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడమే మంచిదైందని అనిపించడం లేదూ!