సెకండ్ వేవ్ కారణంగా మూసేసిన సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ.. ఏపీలో థియేటర్లు తెరుచుకోకపోవటం.. అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం.. బెంగళూరు.. చైన్నైలలో అప్పటికి పరిస్థితి చక్కబడకపోవటంతో తెలంగాణలో థియేటర్లను ఓపెన్ చేసే సాహసం అటు థియేటర్ యజమానులు.. ఇటు ఎగ్జిబిటర్లు.. సినిమాల్ని విడుదల చేయటానికి నిర్మాతలు ముందుు రాలేదు. ఎట్టకేలకు నిన్న (శుక్రవారం, జులై 30) ఓపెన్ అయ్యాయి. సత్యదేవ్ నటించిన తిమ్మరసు.. తేజ సజ్జా నటించిన ‘ఇష్క్ తోపాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు.. మల్టీప్లెక్సుల్లో కొన్ని మాత్రమే తెరుచుకోవటం గమనార్హం. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లు ఓపెన్ చేయాలని భావించినా.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల్లో కొన్ని మాత్రమే తెరుచుకోవటం గమనార్హం. ఉదాహరణకు ప్రముఖ మల్టీఫ్లెక్సు సంస్థ అయిన పీవీఆర్ విషయానికి వస్తే.. హైదరాబాద్ మహానగరంలోని మొత్తం పీవీఆర్ లలో కొన్నింటిని మాత్రమే తెరిచినట్లుగా తెలుస్తోంది. ఇక.. థియేటర్ల విషయానికి వస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం చాలావరకు థియేటర్లు ఓపెన్ కాలేదని చెబుతున్నారు.
మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క థియేటర్ కూడా తెరుచుకున్నది లేదు. బీసీ సెంటర్లలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. థియేటర్లకు అడ్డాలాంటి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మాత్రం కాస్త హడావుడి కనిపించగా.. మరికొన్ని థియేటర్ల దగ్గర పెద్దగా జనాలు కనిపించలేదు. చాలావరకు థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులు కూడా కనిపంచలేదు. పెద్ద సినిమాలు విడుదల కావటం.. సెకండ్ వేవ్ తర్వాత తెరిచిన థియేటర్లలో చిన్న సినిమాలతో మొదలుపెట్టటానికి పెద్దగా ఇష్టపడనట్లుగా చెబుతున్నారు. ప్రేక్షకుల్లో కూడా కరోనా భయం కూడా కాస్త కనిపించినట్లు చెబుతున్నారు.
మొత్తంగా ఈ వారాంతమైన శని.. ఆదివారాల్లో థియేటర్లకు వచ్చే వారిని బట్టి.. అంచనా వేయొచ్చని చెబుతున్నారు. మరోవైపు.. పెద్ద హీరోల సినిమాలు కానీ క్రేజీ సినిమాలు కానీ విడుదలైతే తప్పించి.. ప్రేక్షకుల మూడ్ ను తెలుసుకోవటం కష్టమంటున్నారు. ఒక అంచనా ప్రకారం.. రానున్న రెండు వారాల్లో 80 శాతం మేర థియేటర్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో థియేటర్లు దాదాపుగా తెరుచుకున్నట్లు చెబుతున్నారు. తొలిరోజున థియేటర్లలో 30 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. థియేటర్ల రీఓపెన్ అంత సందడిగా అయితే లేదని చెప్పక తప్పదు.