టాలీవుడ్ కు సంబంధించిన ఒక కీలక నిర్ణయం ఇవాళ కోర్టు తీర్పు రూపంలో వచ్చి పడింది. సామాన్యుడికి వినోదాన్ని అందించే ఈ నెంబర్ వన్ సినిమా మాధ్యమానికి సంబంధించి.. తాజా కోర్టు తీర్పు ఎవరికి లాభం చేస్తుంది.. ఎవరికి నష్టం చేస్తుంది? అనే విషయంలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. సినిమా టిక్కెట్ ధరలు ఇక మీదట తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకంగా.. ఉండకపోవచ్చు. ఎందుకంటే... తమ థియేటర్లలో టిక్కెట్ ధరను పెంచుకునే అధికారాన్ని థియేటర్ యజమానులకే కట్టబెట్టేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీనివల్ల.. ఒక్కో థియేటర్ లో ఒక్కో రకమైన రేట్లు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇలాంటి ఏర్పాటు వలన.. థియేటర్లు లాభాలను కళ్లజూసే అవకాశం ఉంటుంది గానీ.. అంతిమంగా సినిమా పరిశ్రమకు ఎంతో కొంత నష్టం వాటిల్లుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. సినిమా భారీ సినిమానా.. మామూలు సినిమానా అనే దానిని బట్టి.. దాని ప్రదర్శన హక్కుల కోసం ఎంత మొత్తం వెచ్చించాం అనే దానిని బట్టి.. థియేటర్ యజమానులు టిక్కెట్ ధరలను నిర్ణయించుకుంటే.. ఆ మేరకు వారు లాభపడిపోతారు. కానీ.. పెద్ద సినిమాలకు వారు టిక్కెట్ ధరలను భారీగా పెంచేస్తే గనుక.. మొత్తంగా థియేటర్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది.
అసలే టెక్నాలజీ రూపు రేఖలు మారిపోయిన నేపథ్యంలో సినిమా పైరసీని అరికట్టడం అనేది అసాధ్యమైన సంగతిగా ఉంటోంది. ఎంత గొప్ప చిత్రం అయినా.. టెక్నికల్ గా వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా విడుదల అయిన కొన్ని గంటల వ్యవధిలోనే.. పైరేటెడ్ కాపీ.. ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయిపోతున్నదంటే.. అతిశయోక్తి కాదు. కొద్దిగా ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉంటే చాలు.. కొత్త సినిమాలను విడుదల రోజునే.. తమ కంప్యూటర్లలో - మొబైల్ ఫోన్లలో జనం చూసేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఇండస్ట్రీ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతోంది. ఇలాంటి నేపథ్యంలో.. థియేటర్ టిక్కెట్ ధరలు భారీ గాపెరిగితే.. పైరసీ మీద ఆధారపడేవాళ్ల సంఖ్య ఇంకా పెరుగుతందనే ఊహలు వ్యాపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీకి నష్టమే.
అలాగే.. భారీ చిత్రాలను కూడా విడుదలైన కొన్ని వారాల వ్యవధిలోనే యూట్యూబ్ - హాట్ స్టార్ లాంటి ఇంటర్నెట్ మాధ్యమాలలో ప్రజలు ఉచితంగా చూడడానికి అందుబాటులో పెట్టేస్తున్నారు. అలాంటి ఏర్పాటు మీది ఆశతో.. ఎటు చూసినా.. థియేటర్ కు వచ్చి చూసే వారి సంఖ్య తగ్గిపోతుందని.. సినిమాలకు రన్నింగ్ డేస్ తగ్గిపోవడం అనేది.. ఇండస్ట్రీకి నష్టదాయకం అని పలువురు భావిస్తున్నారు.