కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టి కొన్ని గంటలే గుడుస్తుంది. టాలీవుడ్ పరంగా చూస్తే ఈ ఏడాది స్టార్ హీరోలంతా ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు. సంక్రాంతి నుంచి మొదలయ్యే సమరం డిసెంబర్ వరకూ కొనసాగుతుంది. పండుగ సందర్బంగా 'వాల్తేరు వీరయ్య'..'వీరసింహారెడ్డి' రిలీజ్ అవుతున్నాయి. కోలీవుడ్ హీరోల 'వారసుడు'..'తెగింపు' చిత్రాలతో పాటు మరికొన్ని చిన్నా..చితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక పండగ సీజన్ ముగిసింది అనగానే...సమ్మర్ సీజన్ మొదలైపోతుంది. వేసవి సెలవులు కలిసొస్తాయి కాబట్టి ఆ సీజన్ రిలీజ్ కు అనువైందే. ఇప్పటికే చిరంజీవి 'భోళా శంకర్'...బాలయ్య 108వ చిత్రం వేసవికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కినేని అభిమానులు మోస్ట్ అవైటెడ్ గా భావించిన అఖిల్ 'ఏజెంట్' కూడా సమ్మర్కే రానుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్'...'ఆదిపురుష్' చిత్రాలు రేసులో ఉన్నాయి. ముందుగా 'ఆదిపురుష్' రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 'సలార్' డేట్ లాక్ చేస్తారు. ఏడాది చివర్లో ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రెండు భారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యే సినిమాలు కాబట్టి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
అలాగే ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రం కూడా ఇదే ఏడాది సందడి చేయనుంది. మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం ఇప్పటికే ఓ డేట్ లాక్ చేసింది .కానీ ఆ తేదీ రిలీజ్ కష్టమే. అయినా ఏడాది ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. ఇక ఆర్సీ 16వ సినిమా రిలీజ్ సమ్మర్ లేదా ఆగస్టు అంటున్నారు.
షూటింగ్ క్లైమాక్స్ చేరిన నేపథ్యంలో రిలీజ్కి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక 'పుష్ప-2' అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేయగల్గితే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొచ్చేయచ్చు. అది దర్శకుడు సుకుమార్ చేతుల్లోనే ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మాత్రం సమ్మర్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఈలోగా అన్ని పనులు పూర్తి చేయాలన్నది దర్శకుడు క్రిష్ ప్లాన్.
పీకే కూడా ఈ సినిమా షూట్ పైనే బిజీగా ఉన్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు నాని నటిస్తోన్న 'దసరా'..నాగచైతన్య 'కస్టడీ'...రవితేజ 'రావణసూర'..'టైగర్ నాగేశ్వరావు'..రామ్...బోయపాటి పాన్ ఇండియా సినిమాలు ఇదే ఏడాది బాక్సాఫీస్ వద్ద రచ్చే చేస్తాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం 2023లో మౌనాన్ని వహించాల్సిందే. ఇప్పటికే టైగర్ 30వ సినిమా 2024 లో రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటనిచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి 2023 భారీ బడ్జెట్ సినిమాలో బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అన్న తీరున హీరోలు బరిలోకి దిగుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.