కరోనా వైరస్ మహమ్మారీ అంతా మార్చేసింది. ఏడాదిన్నరగా సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల వినోదమంతా ఓటీటీలోనే. భవిష్యత్ లో ఈ విధమైన ఎంటర్ టైన్ మెంట్ కి ఇమేజ్ పెరుగుతుందని ప్రూవ్ అవుతోంది. నిర్మాతలంతా ఓటీటీ రిలీజ్ లకే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఓటీటీ రిలీజ్ లు ఎక్కువగానే ఉన్నాయి. నిర్మాతలు పోటీ పడి మరి రిలీజ్ చేస్తున్నారు. భారీ లాభాలు ఆశించకుండా వచ్చిన లాభాలతో సరిపెట్టుకుంటున్నారు.
తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో నాలుగు పెద్ద చిత్రాలు వివిధ ప్లాట్ ఫామ్ లలో విడుదల కు రెడీగా ఉన్నాయి. అందులో రెండు బాలీవుడ్ సినిమాలు `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` - `షేర్షా` ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తమిళ చిత్రం `నేత్రికన్` - మలయాళ చిత్రం `కురుతి` ఈ వారాంతంలో విడుదల కానున్నాయి.
`భుజ్ : ది ప్రైడ్ ఆప్ ఇండియా` చిత్రం 1970 లలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో జరిగిన చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. ఇందులో అజయ్ దేవగన్,.. సంజయ్ దత్,.. శరద్ కేల్కర్,. సోనాక్షి సిన్హా - ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ఆగస్టు 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇక `షేర్షా` స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం . తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ప్రధాన హీరోహీరోయిన్లుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ - కాష్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 12న అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
నయనతార ప్రధాన పాత్రలో తమిళ్ లో తెరకెక్కిన చిత్రం `నేత్రికన్`. నయన్ ఒక మర్డర్ మిస్టరీని చేధించే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇందులో నయన్ అంధ అమ్మాయి పాత్రను పోషిస్తుంది. మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విఘ్నేష్ శివన్ నిర్మాత. ఈ చిత్రం ఆగస్టు 13 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం `కురుతి`. ఇది పొలిటికల్ థ్రిల్లర్. మను వారియర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా పలు మీడియం సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి.