చీర‌లో చిత్ర‌వ‌ధ చేస్తున్న సీతామ‌హాల‌క్ష్మి!

Update: 2022-11-14 13:30 GMT
మృణాల్ ఠాకూర్ అంటే గుర్తు పట్టడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. సీతామహాలక్ష్మి అంటే తెలుగు ప్రేక్ష‌కులు టక్కున పట్టేస్తారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ.. బాలీవుడ్ సినిమాలతో హీరోయిన్ గా మారింది. సూప‌ర్ 30, తుఫాన్‌, జెర్సీ సినిమాల్లో స‌హ‌జ న‌ట‌న‌తో నార్త్ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

ఇక ఇటీవల విడుదలైన 'సీతారామం' సినిమాతో మృణాల్ కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం సౌత్ ప్రేక్షకుల‌నే కాకుండా నార్త్‌ ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించింది.

అలాగే ఇందులో దుల్కర్ స‌ల్మాన్ కు జోడీగా సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాగూర్ అద‌ర‌గొట్టేసింది. లుక్స్ ప‌రంగానే కాకుండా నటన పరంగానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక సీతారామం తర్వాత మృణాల్‌కు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. మృణాల్ తాజా ఫోటోషూట్ నెట్టింట‌ వైరల్ గా మారింది.

ఎప్పుడు మోడ్ర‌న్‌ దుస్తుల్లో మంట‌లు పెట్టే ఈ భామ‌ తాజాగా చీరలో దర్శనమిచ్చి చిత్రవధ చేసే ప్రయత్నం చేసింది. పింక్ కలర్ శారీ, స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ ధరించిన మృణాల్.. మెడలో సింపుల్ చోకర్, చెవులకు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని లూస్ హెయిర్ లో ఉప్పొంగే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది.

మృణాల్ తాజా పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సీతామహాలక్ష్మిని చీరలో చూసి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఈ క్రమంలోనే  స్టన్నింగ్, క్వీన్‌, హాట్ అంటూ రకరకాల కామెంట్లతో మోత మోగిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాలు చేస్తోంది. అలాగే టాలీవుడ్ లో సైతం పలు ప్రాజెక్టులకు సైన్ చేసిందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News