'సీతారామం' సక్సెస్ తో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'జెర్సీ'లో చిన్న పాత్ర పోషించినా అమ్మడు అప్పుడు? ఎవరికి తెలియదు. కానీ సీత పాత్రతో దక్షిణాది ఫేమస్ అయిపోయింది. సీత పాత్రలో ఆద్యంతం మెప్పించింది. అమ్మడి అందం అభినయంలో సాక్షాత్తు సీతనే దిగొచ్చిందా? అన్నంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.
'నిక్కమైన నీలమెక్కిటి చాలు...తళుకుబెళుకు రాళ్లు తట్టడేలా'? అన్న పద్యాన్ని మరోసారి గుర్తు చేసుకునేలా చేసింది మృణాల్. అవును ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా ఎంతో మంది కొత్త భామలు ఎంట్రీ ఇచ్చారు. వారంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వారే. కానీ మృణాల్ మాత్రం ఒక్క సినిమాతోనే పారితోషికం పెంచేసే స్థాయికి రీచ్ అయిందంటే? అమ్మడి క్రేజ్ ఎలా ఉందన్నది అద్దం పడుతుంది.
ప్రస్తుతం ఈ సొగసరికి దక్షిణాదిన అవకాశాలు క్యూ కడుతున్నాయట. కోలీవుడ్.మాలీవుడ్..శాండిల్ వుడ్ నిర్మాతలు మృణాల్ ని అప్రోచ్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అందులోనూ టాలీవుడ్ అమ్మడి నేచురల్ పెర్పార్మన్స్ కి ఫిదా అయి ఇలాంటి బ్యూటీ అయితేనే తమ సినిమాకి న్యాయం చేయగలదని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
ఇదే తడవగా అమ్మడు పారితోషకం పెంచినట్లు గుస గుస వినిపిస్తుంది. ఎంత హైక్ చేసిందన్నది క్లారిటీ లేదు గానీ..డిమాండ్ మాత్రం భారీగానే ఉందని వినిపిస్తుంది. మృణాల్ మహరాష్ర్ట లోని ధూలే ప్రాంతం నుంచి దిగుమతి అయింది. మరాఠీ భాషలో కొన్ని సినిమాలు చేసింది. అంతకు ముందు బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ సత్తా చాటిన తర్వాత వెండి తెరకు ప్రమోట్ అయింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. వాటిలో అమ్మడు అభినయించిన తీరు చూసే హను రాఘవపూడి సీత పాత్ర బాధ్యతలు ఆమెకి అప్పగించారు. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ లోనూ హను అవకాశం కల్పించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.