మొదటి రోజు భారీ స్కోరే చేశాడు

Update: 2016-10-01 11:30 GMT
ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ.. కొన్ని వారాలుగా దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ధోనీ సృష్టించబోయే బాక్సాఫీస్ సంచలనాలపై ఆసక్తిగా ఉంది. గ్రౌండ్ లో ధోనీ రికార్డులు చాలానే ఉన్నా.. థియేటర్లలో ఎంత స్కోర్ చేస్తాడనేదానిపై ట్రేడ్ వర్గాలు కూడా ఇంట్రెస్ట్ చూపించాయి. ఎవరి ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గకుండా.. మొదటి రోజునే ధోనీ తన సత్తా చూపించేశాడు.

ధోనీ మూవీకి మొదటి రోజున వచ్చిన వసూళ్లు రూ. 21.30 కోట్లు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన మూవీకి.. ఇది చాలా చాలా పెద్ద మొత్తం. అయితే.. ఇదంతా సుశాంత్ గొప్పదనం మాత్రమే కాదని.. ధోనీ లైఫ్ స్టోరీ చూసేందుకు జనాలు చూపించిన ఆసక్తి కూడా ఉందనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. దేశం మొత్తం మీద సగటున 60 శాతం ఆక్యుపెన్సీ కనిపించిందంటే.. ధోనీ ఏ రేంజ్ లో జనాలను థియేటర్లలోకి రాబట్టేశాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో.. ధోనీ సెకండ్ ప్లేస్ లో నిలవడం.. బాక్సాఫీస్ పండిట్స్ ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తేసింది.

ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ మూడు గంటలకు మించిన డ్యురేషన్ కారణంగా.. కొంత మిక్సెడ్ టాక్ నడుస్తోంది. దీంతో రెండో రోజున వసూళ్లు డ్రాప్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ శనివారం కూడా ఇదే స్థాయి వసూళ్లు కానీ.. ఇంతకంటే ఎక్కువగానీ సాధించగలిగితే.. ధోనీ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News