టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు డర్టీ హరి - 7 డేస్ 6 నైట్స్ చిత్రాలతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన స్వీయదర్శకత్వంలో తన తదుపరి సినిమాని ప్రకటించాడు. సోషల్ మీడియాలో తన తదుపరి టైటిల్ `సతి` ప్రీ-లుక్ ను లాంచ్ చేశారు. ప్రీ లుక్ కి చక్కని పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 10 మే 2022న ఉదయం 11:11 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే డర్టీ హరి లాంటి బోల్డ్ సినిమాని తెరకెక్కించిన ఎం.ఎస్.రాజు నుంచి ఈసారి ఎలాంటి సినిమా వస్తుంది? అన్నది డిబేటబుల్ గా మారింది. సతీ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఎంచుకుని ఆయన ప్రయోగం చేస్తున్నారా? అంటూ గుసగుస వేడెక్కిస్తోంది. ఇంతకీ ఈసారి కూడా ఆయన నమ్మిన నయా సిద్ధాంతం ప్రకారం వేడెక్కించే కంటెంట్ తోనే వస్తున్నారా? అన్నది చూడాలి.
ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు.. నటుడు సుమంత్ అశ్విన్ నిర్మిస్తున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్ - రామంత్ర క్రియేషన్స్ కూడా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. నటీనటులు సిబ్బంది తదితర మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
డర్టీ హరిని మించిన కథలెన్నో
ఇండస్ట్రీ సీనియర్ నిర్మాతగా డర్టీహరిని మించిన ఎన్నో కథలు ఎం.ఎస్.రాజు వద్ద ఉన్నాయి. రొటీన్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే రోజులు కావివి. ఈ విషయాన్ని ఒక వెటరన్ నిర్మాతగా విశ్లేషించిన దర్శకుడిగా ఎం.ఎస్.రాజు ఆలోచనా విధానం యూత్ ఫుల్ గా మారింది. ఆయన ఎంపిక చేసే కంటెంట్ సంథింగ్ హాట్.. సంథింగ్ బోల్డ్ గానూ ఎలివేట్ అవుతోంది. ఇంతకుముందు ఆయన డర్టీ హరి చిత్రంతో దర్శకుడిగా విజయం సాధించారు. యూత్ ని ఈ సినిమా థియేటర్లకు రప్పించింది. ఇందులో వేడెక్కించే కథానాయికలతో రాజు గారు మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నారన్న ప్రశంసలు దక్కాయి. డర్టీ హరి తర్వాత `సెవెన్ డేస్ సిక్స్ నైట్స్` కూడా వేడెక్కించే కంటెంట్ తో తెరకెక్కింది. ఇది హాలీవుడ్ రియాలిటీ షో రేంజులో జంటల రోమాంచిత విన్యాసాలతో గుబులు రేపే కంటెంట్ తో తెరకెక్కడం విశేషం. ఈ సినిమాతో పాటు `హరికథ` అనే మరో సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రానికి కూడా తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాత. ఇప్పుడు సతి టైటిల్ ని ప్రకటించారు. ట్రెండుకు తగ్గ సినిమా తీసేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్న ఎం.ఎస్.రాజు మునుముందు మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడతారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రాజుగా పాపులరైన ఎం.ఎస్.రాజు వరుస చిత్రాలతో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో వేచి చూడాలి.
పాన్ ఇండియా రేస్ లో లేరు
అయితే ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. అగ్ర నిర్మాతలంతా పాన్ ఇండియా రేస్ లో ఉన్నారు. భారీ బడ్జెట్లతో భారీ పాన్ ఇండియా సినిమాల్ని నిర్మిస్తున్నారు. కానీ ఎం.ఎస్.రాజు అలాంటి ప్రయత్నాలేవీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన దృష్టి అంతా దర్శకత్వంపైనే ఉందని భావించాలి.