సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా - బ్రాండ్ అంబాసిడర్ గా చాలా బిజీగా ఉన్నప్పటికి కొత్త రంగంలోకి అడుగు పెట్టాలనే తపనతో ఏసియన్ సినిమాస్ తో కలిసి భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయం తెల్సిందే. ఏ ఎమ్ బి అంటూ ఈ మల్టీప్లెక్స్ కు పేరు పెట్టారు. ఈ మల్టీప్లెక్స్ ను ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రంతో దీపావళి కానుకగా ప్రారంభించాలని భావించినప్పటికి నిర్మాణ పనులు పూర్తి కానందున వాయిదా వేయడం జరిగింది. తాజాగా 2.ఓ చిత్రంతో అయినా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం అవుతున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. తాజాగా ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎ ఎమ్ బి మల్టీప్లెక్స్ ప్రారంభ తేదీని ప్రకటించారు.
డిసెంబర్ 2వ తారీకున ఈ మల్టీప్లెక్స్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించబోతున్నారు. అత్యాధునిక హంగులతో - విదేశీయ టెక్నాలజీని ఉపయోగించి ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. దీంట్లో మొత్తం 7 స్క్రీన్ లు ఉండనున్నాయి. అందులో ఆరు స్క్రీన్స్ లలో సినిమాలను ప్రదర్శించనున్నారు. ఒక స్క్రీన్ ను మాత్రం ప్రైవేట్ గా అద్దెకు ఇవ్వడం కాని - ప్రత్యేక షోలకు కాని ఇవ్వనున్నారట. సీటింగ్ - సౌండ్ సిస్టమ్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా తీర్చి దిద్దారట. కొండాపూర్ - కొత్తగూడ జంక్షన్ వద్ద నిర్మాణం జరిగిన ఈ మల్టీప్లెక్స్ మొత్తం సీట్ల కెపాసిటీ 1500లకు పైగానే ఉంటుందట.
ఈ మల్టీప్లెక్స్ లో మొదట ప్రదర్శించనున్న మూవీ ‘2.ఓ’. ఇంకా బుకింగ్ ప్రారంభం కాలేదు. ఇందులో టికెట్ల రేట్లు ఎలా ఉంటాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు మల్టీప్లెక్స్ అవ్వడంతో సినీ జనాలు - ప్రేక్షకుల్లో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఇది సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏ ఎమ్ బీ మల్టీప్లెక్స్ లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.