నాన్నా...నాకే పుట్టవా అనిపించే ఉద్వేగం

Update: 2018-12-13 17:48 GMT
నాన్నంటే.... ఏటీఎం కాదు.... నిలువెత్తు ప్రేమ

నాన్నంటే ఎత్తుకుని ముద్దులు కురిపించడమేనా...

నాన్నంటే స్కూలు ఫీజులు కట్టడమేనా...

నాన్నంటే సెలవు రోజుల్లో కారులో బయటకు తీసుకువెళ్లడమేనా...

నాన్నంటే నువ్వు మోసే పుస్తకాల బరువును తాను గుండెలపై మోడమేనా..

నాన్నంటే బాధ్యత... నాన్నంటే నమ్మకం... నాన్నంటే ధైర్యం... నాన్నంటే గుండెల్లో దాచుకున్న రెండు కన్నీటి బొట్లు... నాన్నంటే తిరిగి పుట్టిన ఆయన తల్లి. నాన్నంటే పైకి కనిపించని ఓ కరుణ... ఓ ప్రేమ. ఎప్పుడో తప్ప బయటపడని ఉద్వేగం... సమయం కోసం ఎదురు చూడని భోరున ఏడ్చే జడివాన.

ఇవన్నీ ప్రతి తండ్రిలోనూ కనిపించేవే. ఆ తండ్రి రిక్షావాడే కావచ్చు.... ఆ తండ్రి కోటీశ్వరుడే కావచ్చు. తండ్రి అంటే తండ్రే. వేరు అర్ధం లేదు.  దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంబానీల ఇంట జరిగిన వివాహ వేడుకే. ముకేష్ అంబానీ తన కుమార్తె ఇషా - ఆనంద్ ల వివాహం జరిపించారు.  ముకేష్ అంబానీ అంటే లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్త. దేశాన్నే కాదు... ప్రపంచాన్నే శాసించగల సత్తా ఉన్న నాయకుడు. ఆయన కుమార్తె వివాహానికి దేశ విదేశాల్లోని ప్రముఖులందరూ హాజరయ్యారు. వారే కాదు... క్రీడా ప్రముఖులు సచిన్ టెండూల్కర్ తన భార్య, కుమారుడితో సహా వచ్చారు.  ఇక సినీ ప్రముఖులు అమీర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ దంపతులు - భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - రాజకీయ ప్రముఖులు మమతా బెనర్జీ - చంద్రబాబు నాయుడు వంటి వారు సైతం హాజరయ్యారు. అంతటి పెద్ద పెళ్లి వేడుకలో ప్రపంచ మేటి కుబేరుడు  కంట తడిపెట్టారు.  పెళ్లి తంతును ప్రముఖ నటుడు అమితా బచ్చన్ ఆహుతులకు వివరిస్తుండగా... కన్యాదానం గురించి ఆహుతులకు వివరిస్తుండగా ముఖేష్ అంబానీ కన్నీటి పర్యంతమయ్యారు.  ఇది పెళ్లికి వచ్చిన వారికి కాసింత ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాదు..... ఎంతటి కుబేరుడైనా తండ్రి తండ్రే అని ముఖేష్ అంబానీ ప్రవర్తన అందరిని కన్నీటి పర్యంతంలో ముంచింది.

వీడియో కోసం క్లిక్ చేయండి



Tags:    

Similar News