డ్రగ్స్ కేసులో సిట్ విచారణలో ప్రత్యేకత కనిపిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ తరఫున హాజరైన వారిలో ప్రత్యేక ట్రెండ్‌ను ముమైత్ ఖాన్ కంటిన్యూ చేసినట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది సినీ సెలబ్రిటీలకు ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్ - తరుణ్ - నవదీప్ - చోటా కే నాయుడు తెల్లచొక్కాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇదొక ప్రత్యేకతగా నిలిచింది. బుధవారం మరో ఫిల్మ్ స్టార్ ఛార్మికౌర్ ను సిట్ విచారించిన సమయంలో ఆమె బ్లూ కలర్ డ్రెస్ లో అప్పటివరకు ఉన్న ట్రెండ్ కు బ్రేక్ వేశారు. అయితే తాజాగా విచారణకు వచ్చిన ఫిల్మ్ స్టార్ ముమైత్ ఖాన్ ఈ ట్రెండ్ ను కొనసాగించారు.
నాంపల్లిలోని ఆబ్కారీ ఆఫీసుకు వచ్చిన ముమైత్ ఖాన్ అచ్చూ చార్మి లాంటి ముదరు నీలం రంగు వస్త్రాదారణలో విచారణకు వెళ్లడం గమనార్హం. చూస్తుంటే మహిళ సినీ ప్రముఖులు ఒక డ్రెస్ కోడ్ ను - పురుష ప్రముఖులు ఇంకో కోడ్ ను ఫాలో అవుతున్నారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాగా, మాదకద్రవ్యాల కేసులో ఎక్సైజ్ శాఖకు చెందిన సిట్ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఆబ్కారీ సిట్ విచారణకు హాజరుకావడానికి సినీనటి ముమైత్ ఖాన్ బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ముంబైలో జరుగుతున్న బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ ప్రత్యేక అనుమతి తీసుకుని రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
మరోవైపు ``సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తో ఎలాంటి సంబంధాలున్నాయి? పరిశ్రమలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే వాదనలో వాస్తవమెంత? మీరు డ్రగ్స్ తీసుకుంటారనే ఆరోపణలున్నాయి.. నిజమేనా? పూరీతో కలిసి ఎక్కువ సినిమాలు చేశారు.. ఆయన డ్రగ్స్ వాడుతారా? మీరు పబ్బులు - క్లబ్బులకు వెళుతుంటారా? పరిశ్రమలో డ్రగ్స్ అనేది సర్వసాధారణమే అనే వాదనను సమర్థిస్తారా?`` అంటూ సిట్ అధికారులు చార్మిపై బుధవారం ప్రశ్నలు సంధించారని తెలిసింది. వీటికి చార్మి.. తనకు డ్రగ్స్ అంటే పడదని, అసలు ఆ అలవాటే లేదని ఒక్కమాటలో చెప్పారని తెలిసింది. ఇవాళ కూడా ముమైత్ ఖాన్ ను కూడా ఈ విధంగా సిట్ ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు.