తెలుగు సినిమా ఇండస్ర్టీ పోకడలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు డబ్బు పెట్టే నిర్మాతదే పై చేయి. కానీ నేడు సీన్ పూర్తిగా రివర్స్. కాంబినేషన్స్ దే పై చేయి. దర్శకుడిలో నిజంగా ట్యాలెంట్ ఉంటే ఇండస్ర్టీ నెత్తిన పెట్టుకుంటుంది. హీరో తర్వాత అగ్ర స్థానం నేడు దర్శకుడిదే. ఆ తర్వాతనే నిర్మాత. ఒకప్పుడు నిర్మాతకు దక్కాల్సిన రాచ మర్యాదలన్నీ ఇప్పుడు కాంబినేషన్స కే దక్కుతున్నాయి. సినిమా ప్లాప్ అయితే రొడ్డున పడేది హీరో - దర్శకుడు కాదు నిర్మాతనే. ఈ విషయంపై దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నో సార్లు గుర్తు చేసినా పట్టించుకునే వాళ్లే కరువయ్యారు.
తాజాగా నటుడు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా నిర్మాతల పక్షాన నిలబడి మాట్లాడారు. ఒకప్పుడు నిర్మాత అనే పేరుకే చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అభిరుచుల మేరకు కాంబినేషన్లను సెట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. హీరోలు పోటీ పడి మరీ పారితోషికాలు పెంచేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు కలిసి పారితోషికం విషయంలో ఉమ్మడిగా కలిసి నిర్ణయం తీసుకునే వారు. మార్కెట్ పెరిగినా 50 వేలకు మించి పారితోషికం ఉండకూదని నిబంధన పెట్టుకునే వారు.
అందువల్ల సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు కొంత మేర నష్టం తగ్గేది. కానే నేడు సీన్ వేరు. పోటీ పడి పారితోషికాలు పెంచేస్తున్నారు. సినిమా ప్లాప్ అయితే నిర్మాత ఒక్క సినిమాతోనే రొడ్డుమీద పడాల్సిందే. ఇలాంటి సమయంలో కొత్త నిర్మాతలు సినిమాలు చేయడం మంచిది కాదని సూచించారు.