పాడె మోసి తన స్నేహ బంధాన్ని చూపించిన మురళీమోహన్..!

Update: 2022-11-16 13:57 GMT
సూపర్ స్టార్ కృష్ణ మురళీ మోహన్ ఇద్దరు మంచి స్నేహితులు.. వీరిద్దరు సినిమాల వల్ల స్నేహితులు కాదు 1956లో సి.ఆర్ రెడ్డి కాలేజ్ లో ఇంటర్ చదివే సమయం నుంచి స్నేహితులు. కృష్ణ మురళీ మోహన్ క్లాస్ మెట్ మాత్రమే కాదు బెంచ్ మెట్స్ కూడా.. ఇద్దరం అప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకున్నామని.. ఒకసారి అక్కినేని నాగేశ్వర రావు కు ఒక వేడుకలో అందుతున్న సత్కారాలను చూసి.. తను కూడా నటుడు అవ్వాలని అనుకున్నారు కృష్ణ. ఆ బలమైన కోరిక కృష్ణని మద్రాస్ పయనమయ్యేలా చేసింది.          

కృష్ణతో పాటు మురళీమోహన్ కూడా సినిమాల కోసం ప్రయత్నించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వారి స్నేహం అలానే ఉంది. కష్ట సుఖాల్లో కలిసి ఉన్నాం.. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు కృష్ణ. ప్రతి పుట్టినరోజుకి మురళీ మోహన్ ఫోన్ చేసి విష్ చేసేవారట.

కృష్ణ గారి ఆకస్మిక మరణంపై స్పందించిన మురళీమోహన్ హెల్త్ సీరియస్ గా ఉందని తెలుసు కానీ ఇంత త్వరగా వెళ్లిపోతారని అనుకోలేదని అన్నారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కాలినడకనే అభిమానులతో పాటు నడిచిన మురళీమోహన్ అంత్యక్రియల సమయంలో కృష్ణ పాడె మోశారు.      

ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైం నుంచి చివరి క్షణాల వరకు కృష్ణ వెంటే ఉన్నారు మురళీ మోహన్. కృష్ణతో ఎన్నో సినిమాల్లో నటించిన మురళీమోహన్ మహేష్ తో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మురళీమోహన్ నిర్మాతగా మహేష్ అతడు సినిమా తీశారు.

కృష్ణ అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులంతా భారీ సంఖ్యలో వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణని చివరిసారిగా చూసేందుకు ఉదయం నుంచే అభిమానులు పద్మాలయ స్టూడియో వద్ద పడిగాపులు కాచారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి కార్యక్రమం మొత్తం పూర్తయ్యేంతవరకు అక్కడే ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News