పూరి ఆఫీసులో పోస్టర్లకు శర్మ ఫిదా

Update: 2018-02-10 07:12 GMT
పూరీకి సినిమాలు తీయ‌డంలోనే కాదు... ఇంటీరియ‌ర్ డిజైనింగ్ లోనూ మంచి టేస్టు ఉన్న‌ట్టుంది. ఆయ‌న ఆఫీసు చూసిన‌వారెవ‌రైనా... అబ్బా అన‌కుండా వెన‌క్కి రాలేరు. సినీ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ కూడా అందుకేం తీసిపోలేదు. మంచి ఇంటీరియ‌ర్‌ తో పాటూ ర‌క‌ర‌కాల కొటేష‌న్లున్న పోస్ట‌ర్లు - ఫోటోలు పూరీ ఆఫీసులో చూసి పిచ్చెక్కిపోయాడు. వాటిని త‌న ట్విట్ట‌ర్లో పోస్టు చేసి... ఇలాంటి పూరీ ఆఫీసులో ఎన్నో అని పోస్టు పెట్టాడు.

ముర‌ళీ శ‌ర్మ‌... టాలీవుడ్ లో విల‌న్ గా - హీరోయిన్ తండ్రి పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ ఉంటాడు. ఎన్నో టాప్ సినిమాల‌లో న‌టించాడు. షూటింగ్ ప‌ని మీద పూరీ ఆఫీసుకు వెళ్లిన ఆయ‌న ఆ ఆఫీసును చూసి మైమ‌ర‌చిపోయాడు. కొటేష‌న్లు కూడా ఆయ‌న‌ను బాగా ఆక‌ర్షించాయి. ఓ రెండు కొటేష‌న్ల‌కు ఫోటోలు తీసి ట్విట్ట‌ర్లో పెట్టాడు. పెద్ద‌గా ఆలోచించు... పెద్ద‌గా ఎదుగు అన్న కొటేష‌న్ అందులో ఒక‌టి. ఇలాంటివి 18000 చ‌ద‌ర‌పు అడుగుల పూరీ ఆఫీసులో ఎన్నో ఉన్నాయ్.

చాలా కాలం పాటూ ఫైవ్ స్టార్ హోటళ్ల‌లో ఆఫీస్ పెట్టుకున్న పూరీ త‌న ఆఫీసును ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్ లా అందంగా, క్రియేటివ్‌ గా నిర్మించుకున్నాడు. 20 కోట్లు ఖ‌ర్చుపెట్టి నిర్మించిన ఆ ఆఫీసుకులు కేవ్ అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం 34లో ఈ ఆఫీస్ ఉంటుంది. ఎందుకో కొన్ని పోస్ట‌ర్ల వెనుక రామ్ గోపాల్ వ‌ర్మ టేస్టు కూడా క‌నిపిస్తూ ఉంటుంది. ఎంతైనా పూరీ-వ‌ర్మ మంచి స్నేహితులు క‌దా.
Tags:    

Similar News