అ! మెజీషియన్ వచ్చేశాడు

Update: 2017-12-26 13:22 GMT
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతోన్న అ! సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని అంచనాలను మాత్రం కొంచెం కొంచెంగా పెంచుతోంది. ఇప్పటివరకు ఎవరు చూడని రేంజ్ లో ఆ సినిమా ఉంటుందని చెబుతుండడంతో ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా మొదట్లో ఎదో సింపుల్ గా స్టార్ట్ చేశారు. కానీ ఆ తరువాత తెలియకుండానే తారాగణంతో పాటు బడ్జెట్ కూడా పెరిగిపోయింది.

ఇప్పటికే సినిమాలోని కొన్ని పాత్రలు ఫస్ట్ లుక్స్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నిత్యా మీనన్ - ఈషా రెబ్బా - రెజీనా - శ్రీనివాస్ అవసరాల మొదలగు వారి పాత్రల యొక్క డిఫెరెంట్ లుక్స్ ని చూపించి చాలా ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు సినిమా గురించి ఎదో అనుకున్నారు గాని ఫస్ట్ లుక్స్ ని చూస్తున్న కొద్దీ సినిమా ఎదో కొత్తగా ఉండబోతోంది అనే ఆలోచన పెరుగుతోంది.

అంతే కాకుండా నాని డబ్బింగ్ చెప్పబోయే ఒక చేప లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసి అంచనాలను పెంచారు. ఇక రీసెంట్ గా గ్రేట్ యాక్టర్ మురళి శర్మ లుక్ ని కూడా చాలా స్పెషల్ గా చూపించారు. ఒక మెజీషియన్ గా ఆయన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమాలో ఎదో కీలకమైన పాత్ర చేసి ఉంటారనే అనుమానం కూడా కలుగుతోంది. మరి ఎంతవరకు అ! ఆకట్టుకుంటుందో చూడాలి.   
Tags:    

Similar News