బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు మురుగదాస్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించి సర్వం సిద్ధమయ్యాయి. మహేష్ బాబు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సినిమా మొదలవుతుంది. ఇటీవలే పూర్తిస్థాయిలో స్క్రిప్టుని తయారు చేసిన మురుగదాస్ మహేష్ కి కూడా వినిపించాడట. ఆయన సూపర్ గా ఉందని కాంప్లిమెంట్లు కూడా ఇచ్చేశాడట. అయితే... మహేష్ - మురుగ ఇలా ఎప్పుడైతే కలిశారో అప్పట్నుంచి టాలీవుడ్ లో కొన్ని ప్రచారాలు ఊపందుకొన్నాయి. సినిమా పేరు కూడా ఫిక్సయ్యిందనీ, మహేష్ బాబు సినిమాలో డబుల్ రోల్ చేయబోతున్నాడని చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. కానీ అవేవీ నిజం కాదట. మురుగదాస్ స్వయంగా మీడియాతో ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
మహేష్ సినిమాకి చట్టానికి కళ్లు లేవు అనే టైటిల్ ఫిక్స్ చేశారని మీడియాలో వచ్చింది. సామాజిక సమస్యల ఆధారంగా మురుగ సినిమాలు చేస్తుంటాడు కాబట్టి బహుశా ఆ పేరుని ఫిక్స్ చేశారేమో అనుకొన్నారంతా. కానీ అది నిజం కాదట. ఇంకా పేరు గురించి ఆలోచించలేదని మురుగ మీడియాతో చెప్పాడు. ఇటీవలే ఆయన చెన్నైలో మాట్లాడుతూ... మహేష్ డబుల్ రోల్ కూడా చేయడం లేదని స్పష్టం చేశాడు. దీంతో ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడ్డట్టయ్యింది. మరో నెల తర్వాత ఆ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.