అనేక వివాదాల్ని దాటుకుని గత ఏడాది దీపావళికి 'కత్తి' సినిమా విడుదలవడం.. సెన్సేషనల్ హిట్టవడం.. వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం.. డీవీడీలు కూడా మార్కెట్లోకి వచ్చేయడం.. ఇలా చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ సినిమాను 'కాపీ' వివాదం మాత్రం వదలట్లేదు. తన కథను మురుగదాస్ కాపీ కొట్టాడంటూ రెండు నెలల పాటు యూనిట్ సభ్యులందరినీ టెన్షన్ పెట్టిన గోపీ అనే అసిస్టెంట్ డైరెక్టర్.. తన కేసును వెనక్కి తీసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్నారు కానీ.. ఆ తర్వాత అన్బువ రాజశేఖర్ అనే మరో రచయిత కోర్టుకెక్కాడు.
ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తాను దర్శకత్వం వహించిన 'భూమి' అనే డాక్యుమెంటరీ కథాంశాన్ని కాపీ కొట్టి మురుగదాస్ 'కత్తి' సినిమా తీశాడని.. ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయకుండా స్టే విధించాలని రాజశేఖర్ తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. కత్తి తెలుగు డబ్బింగ్ పనులు ఆగిపోవడానికి ఈ కేసే కారణం. ఈ కేసు విషయమై మురుగదాస్ కోర్టుకు కూడా హాజరయ్యాడు. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. 'భూమి' కథాంశం 'కత్తి' సినిమాకు దగ్గరగా ఉన్న మాట వాస్తవమే అని.. ఐతే ఇది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చని తమిళ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.