తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగ దాస్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది ఘజిని సినిమాతోనే. అప్పటిదాకా తెలుగులో ఎలాంటి పాపులారిటీ లేని సూర్యకు స్టార్ హీరోతో సమానమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా అది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమా హిందీ రీమేక్ లో చాలా ఉత్సాహంగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో ముందు ప్రిన్స్ మహేష్ బాబుతో తీద్దామనుకన్నానని.. కానీ వీలుపడలేదని డైరెక్టర్ మురుగదాస్ చెప్పాడు.
మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగ దాస్ డైరెక్షన్ చేసిన స్పైడర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లకు రానుంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ మురుగదాస్ మహేష్ తో సినిమా చేయాల్సిన సందర్భాలు చెప్పుకొచ్చాడు. ఘజిని సినిమా డబ్ చేశాక విజయ్ హీరోగా చేసిన తుపాకీని తెలుగులో మహేష్ తో చేద్దామని అనుకున్నా అదీ వర్కవుట్ అవలేదన్నాడు. చివరకు స్పై థ్రిల్లర్ తో తెలుగు - తమిళ్ భాషల్లో ఒకేసారి సినిమా చేద్దామని అడిగిన వెంటనే ఓకే చెప్పాడని మురుగదాస్ చెప్పాడు. స్పైడర్ లో ఇంకో స్పెషాలిటీ గురించి ఉందంటున్నాడు మురుగదాస్. ‘‘సాధారణంగా ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కే చిత్రాల్లో క్లోజప్ షాట్లు మాత్రమే రెండోసారి తీస్తారు. స్పైడర్ లో మాత్రం సైలెంట్ సన్నివేశాల్ని కూడా రెండు భాషల్లో వేరువేరుగా తీశాం. దీని మూలంగా ఖర్చు ఎక్కువే అయినా సినిమా మరింత క్వాలిటీ గా రావడానికి ఇలా తీశాం.’’ అని చెప్పుకొచ్చాడు. రెండునెలలపాటు కంటిన్యూగా రాత్రివేళల్లోనే షూటింగ్ చేస్తూ వచ్చినా మహేష్ నుంచి ఫుల్ సపోర్ట్ లభించిందని అతడి కమిట్ మెంట్ పై ప్రశంసలు కురిపించాడు.
‘‘తమిళం లోకి రావాలని ప్లాన్ చేసుకుని రాలేదు. దేవుడి దయవల్ల తెలుగులో నాకు మంచి ప్రేక్షకాదారణ ఉంది. స్పైడర్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో రెండు భాషల్లో రిలీజవడంతో మార్కెట్ చేయడానికి వీలవుతుంది. అయితే స్పైడర్ లాంటి సినిమాతో తమిళ సినిమాకు పరిచయం కావడం ఆనందంగా ఉందని’’ మహేష్ తమిళ్ ఎంట్రీ గురించి తన ఒపీనియన్ బయటపెట్టాడు.