టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాతో ఎంట్రీ కనక గ్రాండ్ వెల్కమ్ దొరుకుతుంది అని ఆశపడ్డ కోలీవుడ్ సంచలనం అనిరుద్ రవిచందర్ కు దాని ఫలితం తీవ్ర నిరాశ కలిగించింది. అది పక్కన పెడితే అనిరుద్ సైతం రెండు పాటలు మినహాయిస్తే దీనికి ఏమంత గొప్ప సంగీతం అయితే ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మంచి పేరున్న అనిరుద్ చాలా పేలవంగా అజ్ఞాతవాసికి సెట్ చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా హిట్ అయితే ఆ ఫ్లోలో ఇవన్ని కలిసిపోతాయి అనుకున్నాడు కాబోలు మొత్తానికే మోసం వచ్చేసింది. త్రివిక్రమ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు ముందు అనుకున్న అనిరుద్ ని కాకుండా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకోవాలనే టాక్ చాలా బలంగా విన్పిస్తోంది. ఈ నేపధ్యంలో అనిరుద్ కు స్ట్రెయిట్ తెలుగు సినిమా రావడం అయితే అంత ఈజీ కాదు.
కాని కోలీవుడ్ మాత్రం మనోడు కింగే. అందులో అనుమానం లేదు. ఇప్పటికీ అనిరుద్ డిమాండ్ పీక్స్ లో ఉంది. కెరీర్ బాగున్నప్పుడే ఫ్యూచర్ సెటిల్మెంట్ చూసుకోవాలి అన్న రీతిలో అనిరుద్ కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. సమ్మర్ హౌజ్ ఈటరి పేరుతో చెన్నైలో తన కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టేసాడు. ఇది కనక సక్సెస్ అయితే చెయిన్ లాగా తమిళనాడు మొత్తం బ్రాంచీలు స్థాపించాలి అనేది తన ప్లానట. ఇటీవలే ప్రారంభమైన తన రెస్టారెంట్ పట్ల కోలీవుడ్ ప్రముఖులంతా బాగా ఆసక్తి చూపుతున్నారు. వారానికి ఇద్దరో ముగ్గురో వచ్చినా బోలెడు పేరుతో పాటు ఫ్రీ పబ్లిసిటీ కూడా వచ్చేస్తుంది. అనిరుద్ కున్న పేరుకి, సర్కిల్ కి ఇదేమంత పెద్ద విషయం కాదు. సో సమ్మర్ హౌస్ అన్ని సీజన్స్ లోను అదరగొడుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు అనిరుద్.