సర్..ర్రా... వయ్యారీ బ్లాకుబెర్రీ ఫోనులే.. అంటూ జానపద బీట్‌తో ఆకట్టుకున్నాడు సంగీత దర్శకుడు భీమ్స్. ఆ తర్వాత బాబూ .. రాంబాబూ పాటతో మరోసారి చర్చల్లోకొచ్చాడు. తొలిప్రయత్నంలోనే భీమ్స్ సంగీతంలో రైమ్ రిథమ్ ఉందన్న పేరొచ్చింది. ఈయన శైలి వేరుగా ఉందే.. అని కొందరు మెచ్చుకున్నారు. ఆ కొందరిలో సంపత్ నంది, రవితేజ కూడా ఉన్నారు. సంపత్ నంది ప్రారంభం నుంచి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయనే రవితేజని పరిచయం చేశారు. నేను కట్టిన బాణీల్ని రవితేజగారికి వినిపించాను. ఆయన నాకు వెంటనే అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేశారు.. అంటూ చెబుతున్నాడు భీమ్స్.
బెంగాళ్ టైగర్ చిత్రానికి కట్టిన బాణీల్లో చూపుల్లో దీపాల పాటకు చక్కని స్పందన వచ్చింది. ఈ మూవీలో ఐదు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఇటీవలే ప్లాటినం డిస్క్ వేడుకును చేసుకున్నాం. ఈ నెల 10న రిలీజవుతున్న ఈ చిత్రంతో పెద్ద బ్రేక్ వస్తుందన్న నమ్మకం ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు భీమ్స్. సంగీతం అంటే విపరీతమైన పిచ్చి. అలాగని సంగీతం నేర్చుకున్నదేం లేదు. పరిశీలన, పట్టుదలతోనే సంగీత దర్శకుడినయ్యాను. మణిశర్మ గారి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన బాణీల్ని జాగ్రత్తగా పరిశీలించి ఎంతో నేర్చుకున్నా.. అని భీమ్స్ చెప్పారు. మణిశర్మ, చక్రి, దేవీశ్రీ, అనూప్ రూబెన్స్, శేఖర్ చంద్ర , కార్తీక్ తర్వాతి తరం లో ఇంకెవరూ తెలుగు కుర్రాళ్లు సంగీతంలో కనిపించడం లేదు. కనీసం భీమ్స్‌కైనా ఓ చోటిచ్చి మన హీరోలంతా ఎంకరేజ్ చేస్తే బావుంటుంది.