కొద్ది రోజులుగా టాలీవుడ్ లో కమెడియన్లు హీరోలుగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సప్తగిరి - శ్రీనివాస రెడ్డి - పృథ్వీ...ఇలా రెప్యుటెడ్ కమెడియన్లంతా హీరోలుగా చేస్తూ రాణిస్తున్నారు. తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పృథ్వీ `మీలో ఎవరు కోటీశ్వరుడు` చిత్రంతో హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా, మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పృథ్వీ రెడీ అయ్యారు. `మై డియర్ మార్తాండం` అనే కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులును అలరించేందుకు పృథ్వీ సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.`30 రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా` అనే పుస్తకం పట్టుకొని లాయర్ గెటప్ లో ఠీవిగా కూర్చున్న పృథ్వీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ చిత్రంలో పృథ్వీ డిఫెన్స్ లాయర్ పాత్రను పోషించబోతున్నారు. క్రైమ్ కామెడీ - కోర్టు డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. `30 రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా`అనే పుస్తకం చదివి డిఫెన్స్ లాయర్ అయిన పృథ్వీ ....కోర్టులో కేసులు ఎలా వాదించబోతున్నారన్నదే ఈ చిత్ర కథాంశం.
`30 ఈయర్స్ ఇండస్ట్రీ` డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ.....30 డేస్ లో లాయర్ కావడం అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యారు. మజీన్ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కేవీ హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.