బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి.. ప్రచారం అంతా 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న చుట్టూనే సాగింది. మరీ ఊహించుకోలేనంత గొప్ప సీక్రెట్ కాకపోయినా.. దాని చుట్టూ చేసిన ప్రచారం ఎక్కువైంది. రాజమౌళి మేకింగ్ ప్రభావంతో బాహుబలి2 చూడడం మొదలుపెట్టిన కాసేపటికే ఆ ప్రశ్నను ప్రేక్షకులు మర్చిపోతారు.
సరే అదంతా గతం.. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సంగతి ఓపెన్ అయిపోయింది. ఇంకా దీంతో ఏదో చేద్దామనే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా సత్యరాజ్ కూతురు ఇదే టాపిక్ పై బోలెడన్ని కబుర్లు చెబుతోంది. 'మా నాన్న మాకు అన్ని విషయాలు చెబుతారు.. స్క్రిప్ట్ కూడా నెరేట్ చేస్తుంటారు. నాకు 10ఏళ్ల వయసు నుంచి ఇలా వింటూనే ఉన్నాను. కానీ బాహుబలిని కట్టప్ప పాత్ర ఎందుకు చంపిదనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. బహుశా మా నాన్న మా దగ్గర దాచిన రహస్యం ఇదొకటే' అంటోంది న్యూట్రిషనిస్ట్ దివ్య సత్యరాజ్.
తన క్లయింట్స్ తో పాటు.. తెలిసిన వాళ్లంతా ఇదే ప్రశ్న దివ్యను అడిగేవారట. కానీ ఆ రహస్యం తనకు కూడా సినిమా చూసే వరకు తెలియదన్న దివ్య సత్యరాజ్.. ఇప్పిటివరకూ రెండు సార్లు సినిమా చూసిందట. త్వరలో మళ్లీ చూస్తానని చెబుతోంది కట్టప్ప కూతురు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/